Loading...
Allu arjun: సోషల్ మీడియాలో ట్రోలింగ్‌పై అల్లు అర్జున్ స్పందన.. అభిమానులకు విలువైన సూచనలు
సోషల్ మీడియాలో ట్రోలింగ్‌పై అల్లు అర్జున్ స్పందన.. అభిమానులకు విలువైన సూచనలు

Allu arjun: సోషల్ మీడియాలో ట్రోలింగ్‌పై అల్లు అర్జున్ స్పందన.. అభిమానులకు విలువైన సూచనలు

వ్రాసిన వారు Moogati Shabari
Jul 28, 2026
04:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

సోషల్ మీడియాలో ఇతరులను విమర్శిస్తూ సమయాన్ని వృథా చేయడం కంటే, మనకు ఇష్టమైన పనిపై దృష్టి పెట్టడం ఎంతో మంచిదని సినీ నటుడు అల్లు అర్జున్ అభిమానులకు సూచించారు. ఇటీవలి కాలంలో ఒక హీరో అభిమానులు మరో హీరోను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా వేదికగా విమర్శలు, ట్రోల్స్, మార్ఫింగ్ ఫొటోలు, మీమ్స్‌తో దూషించే ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో అభిమానులతో ప్రత్యేకంగా సమావేశమైన అల్లు అర్జున్ వారితో ముచ్చటించి, ఫొటోలు దిగారు. ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

వివరాలు

అభిమానులతో ఏం చెప్పారంటే..

"ఈరోజు మీ అందరి మధ్య ఉండటం నాకు ఎంతో ఆనందం, గర్వంగా ఉంది.

మీలో ఉన్న ఉత్సాహం, ప్రేమ ఎప్పటికీ అలాగే కొనసాగాలి. ఈ సందేశం నా అభిమానులకే కాదు, నన్ను ఇష్టపడని వారికీ కూడా చెప్పాలనుకుంటున్నాను.

ఎవరినైనా విమర్శించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. మనకు నచ్చని వ్యక్తుల కోసం మన డబ్బును ఖర్చు పెట్టం కదా.

అలాంటప్పుడు మన సమయం, శక్తి, ఆలోచనలను ఎందుకు వృథా చేయాలి?" అని ఆయన ప్రశ్నించారు.

సోషల్ మీడియాలో వచ్చే ప్రతి ట్రోల్‌కు స్పందిస్తూ కాలాన్ని వృథా చేసుకోవడం కంటే, అదే సమయాన్ని వ్యక్తిగత అభివృద్ధికి వినియోగించుకోవాలని అల్లు అర్జున్ సూచించారు.

"మీకు నచ్చిన పని చేయండి. మీకు ఇష్టమైన వ్యక్తితో సమయం గడపండి.

వివరాలు

అట్లీతో భారీ బడ్జెట్ మూవీ..

కనీసం ఆ క్షణాలను అయినా ఆనందంగా ఆస్వాదించగలుగుతారు. కానీ ఎవరినీ ట్రోల్ చేయొద్దు.

సమయం, శక్తి ప్రతి ఒక్కరికీ పరిమితంగానే ఉంటాయి. ఒక రోజులో మనకు ఉన్న శాతం శక్తిని ఏ పనికి ఉపయోగిస్తున్నామనేదే నిజంగా ముఖ్యం" అని అభిమానులకు సూచించారు.

అల్లు అర్జున్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశమవుతున్నాయి.

అభిమానులు కూడా ఆయన సందేశాన్ని పెద్ద ఎత్తున పంచుకుంటున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'రాకా'లో అల్లు అర్జున్ నటిస్తున్నారు.

ఈ సినిమా చిత్రీకరణ దశలో కొనసాగుతోంది. అనంతరం దర్శకుడు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందనున్న మాస్ కమర్షియల్ చిత్రంలో ఆయన నటించనున్నారు.

ADVERTISEMENT