LOADING...
Allu arjun: 'రాకా'లో అల్లు అర్జున్‌కు నాలుగు పాత్రలా? సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం
'రాకా'లో అల్లు అర్జున్‌కు నాలుగు పాత్రలా? సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం

Allu arjun: 'రాకా'లో అల్లు అర్జున్‌కు నాలుగు పాత్రలా? సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం

వ్రాసిన వారు Moogati Shabari
Jul 12, 2026
02:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా, స్టార్ డైరెక్టర్ అట్లీ రూపొందిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'రాకా' ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఏకంగా నాలుగు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. తాత, తండ్రి, ఇద్దరు కుమారుల పాత్రలను ఆయనే పోషిస్తారని ప్రచారం సాగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే, అల్లు అర్జున్ కెరీర్‌లో తొలిసారిగా ఒకే సినిమాలో నాలుగు విభిన్న పాత్రల్లో నటించిన చిత్రంగా 'రాకా' ప్రత్యేక గుర్తింపు పొందనుంది.

వివరాలు

నాలుగు పాత్రలకు సంబంధించి లుక్ టెస్ట్..

సినీ వర్గాల సమాచారం మేరకు, తొలుత దర్శకుడు అట్లీ ఈ కథను డబుల్ రోల్ కాన్సెప్ట్‌తో రూపొందించారని తెలుస్తోంది. తండ్రి, తాత పాత్రల కోసం వేర్వేరు నటులను ఎంపిక చేయాలని భావించారట. అయితే, అన్ని పాత్రలను తానే చేయడానికి అల్లు అర్జున్ ఆసక్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రారంభంలో ఈ నిర్ణయంపై అట్లీకి కొంత సందేహం ఉన్నప్పటికీ, లుక్ టెస్ట్ అనంతరం నాలుగు పాత్రల్లో అల్లు అర్జున్ కనిపించడం సినిమాకు మరింత బలం చేకూరుస్తుందని ఆయన అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. అయితే, ఈ వార్తలపై చిత్ర బృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

వివరాలు

కథానాయికగా దీపికా పదుకొణె..

ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తోంది. ప్రపంచ స్థాయిలో ప్రేక్షకులు ఇప్పటివరకు చూడని విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను ఈ సినిమా అందిస్తుందని దర్శకుడు అట్లీ ఇప్పటికే వెల్లడించారు. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ కొనసాగుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ను 2027లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయాలని నిర్మాతలు లక్ష్యంగా పెట్టుకున్నారు.

Advertisement