
Allu Arjun: ప్రభాస్ రికార్డ్ బ్రేక్ చేసిన అల్లు అర్జున్.. ఇండియాలో టాప్ స్టార్‌గా గుర్తింపు!
ఈ వార్తాకథనం ఏంటి
సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప 2 ఇండియన్ బాక్సాఫీస్‌లో చక్రం తిప్పింది. ఫస్ట్ డేనే బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా రూ.290 కోట్లకు పైగా ఓపెనింగ్స్ సాధించింది. ఓవరాల్‌గా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు నమోదు చేసి ఇండియన్ సినీ ఇండస్ట్రీ రికార్డ్ సృష్టించింది. ఈ సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ నెక్స్ట్ లెవల్‌కి చేరుకున్నాడు. పుష్ప అంటే నేషనల్ కాదు... ఇంటర్నేషనల్ అని డైలాగ్ చెప్పినట్లే, ఆయన స్థాయి ఇప్పుడు గ్లోబల్ లెవల్‌కి చేరినట్లు ప్రేక్షకులు, పరిశీలకులు చెబుతున్నారు. యాక్టింగ్, యాక్షన్, ఎమోషన్స్‌లో తన ప్రతిభతో అల్లు అర్జున్ ఆడియన్స్‌ను ఫిదా చేసేశాడు. దీంతో ఆయన డిమాండ్ కూడా నెక్స్ట్ లెవల్‌కి పెరిగింది.
Details
రూ.175 కోట్ల పారితోషకం
భారీ నిర్మాణ సంస్థలన్నీ ఆయనతో సినిమాలు చేసేందుకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో ఒక్కో సినిమాకు ఒక రేంజ్‌లో రెమ్యునరేషన్ తీసుకోవడం ద్వారా సరికొత్త రికార్డులు సృష్టించాడు అల్లు అర్జున్. ప్రస్తుతానికి తమిళ దర్శకుడు అట్లీతో హాలీవుడ్ రేంజ్‌లో సినిమా చేస్తున్న ఆయన, రూ. 175 కోట్ల భారీ రెమ్యునరేషన్ పొందుతున్నారు. ముందుగా ఈ రికార్డ్ పాన్-ఇండియా స్టార్ ప్రభాస్‌కే చెందింది. ఆయన గత చిత్రాల కోసం రూ. 150 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నాడు. అల్లు అర్జున్ ఇప్పుడు ఈ రికార్డును బ్రేక్ చేసి ఇండియన్ టాప్ స్టార్‌గా నిలిచాడు. రానున్న సినిమాలతో హాలీవుడ్ రేంజ్‌లో మరిన్ని సరికొత్త రికార్డులు అల్లు అర్జున్ క్రియేట్ చేస్తారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.