తదుపరి వార్తా కథనం

తన సతీమణి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకమైన వీడియోను షేర్ చేసిన అల్లు అర్జున్
వ్రాసిన వారు
Sriram Pranateja
Sep 29, 2023
05:26 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహా రెడ్డి బర్త్ డే ఈరోజు. ఈ సందర్భంగా అల్లు అర్జున్, ఇన్ స్టాగ్రామ్ లో ప్రత్యేకమైన వీడియోను షేర్ చేసారు.
ఈ వీడియోలో, అల్లు స్నేహా ర్యాండమ్ పిక్స్, వీడియోస్ ఉన్నాయి.
వీడియో షేర్ చేయడంతో పాటు హ్యాపీ బర్త్ డే క్యూటీ, నా జీవితాన వెలుగువి నువ్వే అంటూ చిన్న సందేశం రాసుకొచ్చారు.
ప్రస్తుతం అల్లు అర్జున్ షేర్ చేసిన వీడియో, ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ గా మారుతోంది.
తన సతీమణికి సోషల్ మీడియా ద్వారా ప్రత్యేకమైన వీడియోతో విషెస్ చెప్పడం క్యూట్ గా ఉందని కామెంట్లు పెడుతున్నారు.
అల్లు అర్జున్, అల్లు స్నేహా రెడ్డి ల వివాహం 2011లో జరిగింది.