LOADING...
MegaStar : అల్లు కనకరత్నం నేత్రదానం.. చిరంజీవి భావోద్వేగం
అల్లు కనకరత్నం నేత్రదానం.. చిరంజీవి భావోద్వేగం

MegaStar : అల్లు కనకరత్నం నేత్రదానం.. చిరంజీవి భావోద్వేగం

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 31, 2025
09:43 am

ఈ వార్తాకథనం ఏంటి

అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నం వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ నిన్న తెల్లవారుజాము కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే ఆమె బ్రతికి ఉన్నప్పుడే మెగాస్టార్ చిరంజీవి చేపట్టిన బ్లడ్ డొనేషన్, ఐ డొనేషన్ కార్యక్రమాల ప్రభావం ఆమెపై బలంగా పడింది. మనిషి పోయాక కాలి బూడిద అయిపోయే వాటిని ఇతరులకు దానం చేయడం చాలా మంచి విషయమని భావించిన ఆమె, తాను మరణించిన తర్వాత తన కళ్లను దానం చేయాలని అప్పట్లో మాట ఇచ్చారు.

Details

నేత్రధానం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం

ఈ నేపథ్యంలో ఆమె కన్నుమూసిన తర్వాత ఆమె కళ్లను దానం చేయాలని అల్లు అరవింద్‌ను అడిగాను, ఆయన కూడా వెంటనే అంగీకరించారని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. దీంతో అల్లు కుటుంబం ఆమె కళ్లను దానం చేసింది. తాజాగా జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించిన చిరంజీవి, అల్లు కనకరత్నం గారి నేతృధానం ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని అన్నారు. మొత్తానికి అల్లు కనకరత్నం గారి కంటి దానం నిర్ణయం, చిరంజీవి ప్రోత్సహిస్తున్న సేవా కార్యక్రమాలకు మరో మైలురాయిగా నిలిచింది.