అల్లు శిరీష్ కొత్త సినిమా బడ్డీ గ్లింప్స్ విడుదల: టెడ్డీ బేర్ ప్రపంచంలోకి స్వాగతం
ఈ వార్తాకథనం ఏంటి
ఊర్వశివో రాక్షసివో తర్వాత అల్లు శిరీష్ బడ్డీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అల్లు శిరీష్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు బడ్డీ సినిమా గ్లింప్స్ విడుదల చేసారు.
గ్లింప్స్ చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అల్లు శిరీష్ ఇప్పటివరకు ప్రయత్నం చేయని సరికొత్త జోనర్ లో బడ్డీ సినిమా రూపొందిందనీ, ఈ సినిమాలో అల్లు శిరీష్ సరికొత్తగా కనిపించబోతున్నారని తెలుస్తోంది.
టెడ్డీ బేర్ ప్రపంచంలోకి స్వాగతం అంటూ గ్లింప్స్ వీడియో మొదట్లో చెప్పేసారు. దానికి తగ్గట్టుగానే టెడ్డీ బేర్ ను వెంబడిస్తూ ట్రైన్ లోకి ఎక్కుతారు విలన్లు. వాళ్ళందరితో ఫైట్ చేసి టెడ్డీని కాపాడతాడు అల్లు శిరీష్.
గ్లింప్స్ ని పూర్తిగా యాక్షన్ అంశాలతో నింపేసారు.
Details
టెడ్డీ సినిమాకు రీమేక్ గా బడ్డీ
బడ్డీ సినిమాను 2021లో తమిళంలో రిలీజైన టెడ్డీ రీమేక్ గా తెరక్కిస్తున్నారని అంటున్నారు. ఈ విషయాన్ని గ్లింప్స్ వీడియోలో ఎక్కడా వెల్లడి చేయకపోయినప్పటికీ బడ్డీ విజువల్స్ చూస్తుంటే అలాగే అనిపిస్తుందని చెప్పుకుంటున్నారు.
ఆర్య హీరోగా తెరకెక్కిన టెడ్డీ సినిమాలో సాయేషా సైగల్ హీరోయిన్ గా చేసింది. అదలా ఉంచితే, ప్రస్తుతం బడ్డీ సినిమాను స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు.
సామ్ ఆంటన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు హిప్ హాప్ థమిజ సంగీతం అందిస్తున్నారు. అజ్మల్ అమీర్, ప్రిషా రాజేష్ సింగ్, ముఖేష్ కుమార్, మహమ్మద్ అలీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బడ్డీ గ్లింప్స్ విడుదల
Buckle up for an action packed rise and catch the first glimpse of my "Buddy". @StudioGreen2https://t.co/4n6RrsBAcQ pic.twitter.com/D5VlCM57nj
— Allu Sirish (@AlluSirish) May 30, 2023