Allu Sirish: నెక్లెస్ ధరించడంపై సోషల్ మీడియాలో ట్రోల్స్.. తనదైన స్టైల్‌లో సమధానం ఇచ్చిన అల్లు శిరిష్
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ యువ హీరో అల్లు శిరీష్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. కొంతకాలంగా నయనికతో ప్రేమలో ఉన్న శిరీష్, ఇటీవలే పెద్దల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇరు కుటుంబాల, సన్నిహితులు, బంధువుల సమక్షంలో గ్రాండ్‌గా జరిగిన నిశ్చితార్థ వేడుకలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ దంపతులు, వరుణ్ తేజ్ దంపతులు, మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, నితిన్, సాయి ధరమ్ తేజ్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకలో తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీటిలో శిరీష్ లుక్ ప్రత్యేకంగా ప్రజల దృష్టిని ఆకర్షించింది. కారణం అతడు నిశ్చితార్థ వేడుకలో నెక్లెస్ ధరించి కనిపించడమే.
Details
పెళ్లికి వడ్డాణం ధరిస్తే ఏమైపోతారో
సోషల్ మీడియాలో అబ్బాయిలు నెక్లెస్ ధరించడం ఏంటని కొందరు విమర్శలు గుప్పించారు. మరికొందరు మాత్రం మీమ్స్, ట్రోల్స్ ద్వారా పెద్ద చర్చను రేపారు. ఇందుకు ప్రతికూలంగా వచ్చిన వ్యాఖ్యలకు శిరీష్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా గట్టి స్పందన ఇచ్చారు. "మన తెలుగు మీమ్స్ చాలా సరదాగా ఉన్నాయి. చోకర్లను మన భారతీయ మహారాజులు, మొఘలులు కూడా ధరించేవారు. పూర్వకాలంలో రాజులు అందరూ చోకర్లు పెట్టుకునేవారని పేర్కొన్నారు. అలాగే, "నెక్లెస్ కే ఇలా అయిపోతే.. పెళ్లికి వడ్డాణం పెట్టుకుంటే ఏమైపోతారో అని ఫన్నీ మీమ్ షేర్ చేసి స్పందించారు. ప్రస్తుతం శిరీష్ చేసిన ట్వీట్లు నెట్టింట వైరల్‌గా మారి, అభిమానుల మధ్య చర్చలకు దారితీస్తున్నాయి.