LOADING...
Allu Sirish-Nayanika: అల్లు శిరీష్ పెళ్లి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?
అల్లు శిరీష్ పెళ్లి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

Allu Sirish-Nayanika: అల్లు శిరీష్ పెళ్లి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 29, 2025
01:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

అల్లు హీరో అల్లు శిరీష్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. తన ప్రియురాలు నయనికతో గత అక్టోబర్‌లో ఘనంగా నిశ్చితార్థం చేసుకున్న ఆయన, తాజాగా పెళ్లి తేదీని అధికారికంగా వెల్లడించారు. వచ్చే ఏడాది మార్చి 6న తన వివాహం జరగనున్నట్లు శిరీష్ తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న ఓ పాటకు అల్లు అయాన్‌, అర్హలతో కలిసి రీల్ చేస్తూ ఈ విషయాన్ని సరదాగా ప్రకటించారు. ఆ వీడియోలో "బాబాయ్ సంగీత్ ఎప్పుడు ఉంటుంది?" అని వారు అడగ్గా మనం దక్షిణాది వాళ్లం, అలాంటివి చేసుకోం అంటూ శిరీష్ నవ్వుతూ సమాధానం ఇచ్చారు. అయితే పెళ్లి ఎక్కడ జరుగుతుందనే వివరాలను మాత్రం వెల్లడించలేదు.

Details

అలా మా మధ్య ప్రేమ మొదలైంది

విశేషమేమిటంటే... అల్లు అర్జున్ - స్నేహారెడ్డి వివాహం కూడా 2011లో ఇదే మార్చి 6న జరగడం గమనార్హం. శిరీష్ - నయనికల ప్రేమ కథకు ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి పెళ్లి సమయంలో వీరి పరిచయం మొదలైంది. ఆ వేడుకకు నటుడు నితిన్ తన సతీమణి షాలినితో హాజరుకాగా, షాలినితో పాటు ఆమె స్నేహితురాలు నయనిక కూడా వచ్చారు. తొలిసారి ఆమెను అక్కడే చూసినట్లు శిరీష్ తెలిపారు. ఆ పరిచయం క్రమంగా స్నేహంగా, ఆపై ప్రేమగా మారిందని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. నన్ను తమ సర్కిల్‌లోకి ఆహ్వానించిన నయనిక స్నేహితులందరికీ థాంక్స్ అంటూ శిరీష్ భావోద్వేగంగా చెప్పారు.

Advertisement