
'సలార్'తో పాటు.. 2023లో తొలిరోజు భారీ వసూళ్లను సాధించిన సినిమాలు ఇవే..
ఈ వార్తాకథనం ఏంటి
2023లో అనేక భారతీయ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దుమ్ముదిలిపాయి. కరోనా తర్వాత ఈ ఏడాది సినిమా పరిశ్రమ కళకళలాడింది.
ప్రేక్షకులు ఉత్సాహంతో థియేటర్లకు తరలిరావడంతో పలు చిత్రాలు భారీగా వసూళ్లను సాధించారు.
కొన్ని సినిమాలు అయితే తొలిరోజు ఓపెనింగ్స్‌ను రికార్డు స్థాయిలో సాధించాయి. ఈ క్రమంలో ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-5 భారతీయ చిత్రాలను ఓసారి పరిశీలిద్దాం.
1.'సలార్'
ప్రభాస్ నటించిన పవర్ ప్యాక్ట్ మూవీ 'సలార్'. డిసెంబర్ 22న థియేటర్లలోకి వచ్చింది.
ఈ సినిమా భారత్‌లో రూ.95 కోట్లను రాబట్టగా.. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.175 కోట్లు వసూలు చేసింది.
దీంతో ఈ ఏడాది తొలిరోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది.
కలెక్షన్స్
2. జవాన్
'సలార్' విడుదలకు ముందు, షారుక్ ఖాన్ 'జవాన్' మూవీ మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో మొదటి స్థానంలో ఉంది.
ఈ సినిమా భారత్‌లో తొలిరోజు రూ.75కోట్లు రాబట్టింది.
3.యానిమల్
రణబీర్ కపూర్ నటించిన 'యానిమల్' కూడా ఈ ఏడాది భారీ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ చిత్రం తొలిరోజే దేశంలో రూ.65కోట్లు వసూలు చేసింది.
4.'పఠాన్'
ఈ ఏడాది షారుక్, దీపికా పదుకొనే జంటగా నటించిన చిత్రం 'పఠాన్'. తొలిరోజు ఈ సినిమా భారత్‌లో రూ.57కోట్లు రాబట్టింది.
5.టైగర్-3
సల్మాన్‌ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన 'టైగర్-3' కూడా అభిమానులను ఆకట్టుకుంది.
ఈ చిత్రం తొలిరోజు రూ.44.50కోట్లు వసూలు చేసింది.