Page Loader
Amaran Special Show: ముఖ్యమంత్రి స్టాలిన్ కోసం 'అమరన్' స్పెషల్ షో.. శివకార్తికేయన్, సాయి పల్లవికి ప్రశంసలు 
ముఖ్యమంత్రి స్టాలిన్ కోసం 'అమరన్' స్పెషల్ షో.. శివకార్తికేయన్, సాయి పల్లవికి ప్రశంసలు

Amaran Special Show: ముఖ్యమంత్రి స్టాలిన్ కోసం 'అమరన్' స్పెషల్ షో.. శివకార్తికేయన్, సాయి పల్లవికి ప్రశంసలు 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 31, 2024
04:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

శివకార్తికేయన్ ప్రధాన పాత్రలో నటించిన బహుభాషా బయోగ్రాఫికల్ యాక్షన్ మూవీ 'అమరన్' దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్, సోనీ పిక్చర్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్మెంట్ కలిసి నిర్మించారు. ఈ సినిమాలో సాయి పల్లవి కథానాయికగా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందింది. కేరళకు చెందిన కార్గిల్ వీరుడు, మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం, జమ్ముకశ్మీర్ రియల్ లొకేషన్స్‌లో చిత్రీకరించడం ద్వారా ఆర్మీ రియాలిటీని ప్రతిభించిందింది. తమిళనాడులో ప్రత్యేకంగా ప్రదర్శించిన ఈ చిత్రాన్ని సీఎం స్టాలిన్‌తో పాటు పలువురు ప్రముఖులు వీక్షించారు.

Details

అద్భుతంగా నటించిన సాయి పల్లవి

ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ చిత్రానికి సంబంధించిన ప్రత్యేక ప్రదర్శనలో పాల్గొని శివకార్తికేయన్, సాయి పల్లవి నటనపై ప్రశంసలు కురిపించారు. అటు సినిమా చూసిన ఆర్మీ అధికారులు కూడా చిత్ర బృందంపై ప్రశంసలు వ్యక్తం చేశారు. ఇందులో చూపించిన సన్నివేశాలు, సైనికుల జీవితాలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని వారు తెలిపారు. ముఖ్యమంత్రి ప్రోత్సాహం తనకు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చిందని, మేజర్ ముకుంద్‌ జీవితం తెరపై అద్భుతంగా మలిచినందుకు ప్రశంసలు అందడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. ఇక సినిమా విడుదలైన ప్రతి ప్రాంతంలో సూపర్ హిట్ టాక్‌ పొందుతూ, సాయి పల్లవి పాత్రకు ప్రత్యేక ప్రశంసలు దక్కాయి.