Page Loader
మోగుతున్న అంబాజీపేట మ్యారేజి బ్యాండు.. టీజర్ రిలీజ్ 
సుహాస్ కొత్త మూవీ టీజర్ ఇదే

మోగుతున్న అంబాజీపేట మ్యారేజి బ్యాండు.. టీజర్ రిలీజ్ 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Oct 09, 2023
06:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

యువ కథానాయకుడు సుహాస్ 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' సినిమాలో నటిస్తున్నాడు. ఇవాళ మూవీ టీజర్ ని అధికారికంగా రిలీజ్ చేశారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేస్తన్న సుహాస్, మరోవైపున హీరోగానూ వరుస సినిమాలతో ప్రేక్షకుల ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటికే కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్ చిత్రాలతో హీరోగా మంచి హిట్స్ అందుకున్నాడు. ఈ క్రమంలోనే హీరోగా 6 సినిమాలను ప్రకటించేశాడు. అందులో 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' ఉంది. గ్రామీణ నేపథ్యం ఉన్నకథాంశంతో తీర్చిదిద్దుతున్నారు. లవ్ స్టోరీతో స్టార్ట్ అయిన టీజర్‌లో ఆడపిల్లల పుడితే భారం అనుకునే అంశాన్ని చూపించారు. జాతిభేదం అంశాలను ప్రదర్శించారు. ధీరజ్ నిర్మిస్తున్న ఈ సినిమాని బన్నీ వాస్, దర్శకుడు వెంకటేష్ మహా ప్రెజెంటర్స్ గా వ్యవహరిస్తుండగా. దుశ్యంత్ దర్శకత్వం వహిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అంబాజీపేట మ్యారేజి బ్యాండు టీజర్