NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Anant Radhika Wedding: పెళ్లి కోసం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన అంబానీ కుటుంబం 
    తదుపరి వార్తా కథనం
    Anant Radhika Wedding: పెళ్లి కోసం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన అంబానీ కుటుంబం 
    పెళ్లి కోసం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన అంబానీ కుటుంబం

    Anant Radhika Wedding: పెళ్లి కోసం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన అంబానీ కుటుంబం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jul 11, 2024
    10:59 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆసియాలోనే అత్యంత సంపన్నుడు ముకేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ను జూలై 12న (అనంత్-రాధిక వెడ్డింగ్) పెళ్లి చేసుకోబోతున్నారు.

    అంబానీ కుటుంబం తమ సంపదతో ప్రపంచాన్ని శాసిస్తున్నప్పటికీ, ఈ కుటుంబానికి సంబంధించిన అనేక అంశాలు విభిన్నంగా, ప్రత్యేకతను కలిగి ఉన్నాయి.

    అనంత్ పెళ్లి కోసం అంబానీ కుటుంబం ఎన్నో పాత మూస పద్ధతులను బద్దలు కొట్టి సమాజానికి అద్దం పట్టింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

    #1

    అబ్బాయి తరుపున అన్ని ఏర్పాట్లు  

    సాధారణంగా మన సమాజంలో పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు అమ్మాయిల కుటుంబంపై మోపడం చూస్తుంటాం, అయితే ఈ పెళ్ళిలో అన్ని ఏర్పాట్లు చేసిన అంబానీ కుటుంబీకుల ఈ అడుగు మెచ్చుకోదగినది.

    పెళ్లి ఖర్చు మొత్తం అంబానీ కుటుంబమే భరిస్తోందని వార్తలు వస్తున్నాయి.

    గృహ శాంతి పూజ మినహా, ప్రతి వివాహ వేడుకను అంబానీ కుటుంబం నిర్వహించింది. ముంబైలోని అంబానీకి చెందిన జియో కన్వెన్షన్ సెంటర్‌లో పెళ్లి కూడా జరుగుతోంది.

    సమాచారం 

    పెళ్లికి ఎంత ఖర్చు పెట్టారు? 

    నివేదికల ప్రకారం, అనంత్-రాధికల పెళ్లికి మొత్తం 1,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అవుతుంది. ఇంతకు ముందు కూడా, ఇషా అంబానీ, ఆకాష్ అంబానీల వివాహాల కోసం అంబానీ కుటుంబం చాలా ఖర్చు చేసింది.

    #2

    అత్తగారు,కోడలు మధ్య అనుబంధం 

    ముఖేష్ తల్లి కోకిలాబెన్ అంబానీకి తన కోడలు ఇందరు అంటే చాలా ఇష్టం. సరిగ్గా అదే విధంగా, నీతా అంబానీ తన పెద్ద కోడలు శ్లోకా మెహతా, చిన్న కోడలు రాధికపై బహిరంగంగా తన ప్రేమను కురిపించడం మనకి కనిపిస్తుంది.

    పెళ్లి కుదిరినప్పటి నుండి అంబానీ కుటుంబం తమ ఇంట్లో జరిగే ప్రతి ఫంక్షన్‌లో అనంత్-రాధికలకు పెద్దపీట వేశారు. రాధిక ను తన కూతురు ఇషా లానే చూస్తోంది నీతా అంబానీ.

    #3

    ప్రతి పనిలోనూ రాధిక ముందుండేది

    సాధారణంగా పెళ్లి నిశ్చయమైన తర్వాత అమ్మాయి గుర్తింపు తగ్గుతుంది, కానీ నీత తన కోడలుతో ఆలా ప్రవర్తించలేదు.

    అనంత్-రాధికల రిలేషన్ ఖరారు అయినప్పటి నుంచి ఆమె రాధికను తన కూతురిగా భావిస్తోంది.

    అంబానీ కుటుంబం తమ ఇంట్లో జరిగే ప్రతి చిన్న, పెద్ద పని, ఫంక్షన్‌లో రాధికను ముందంజలో ఉంచింది .

    #4

    పెళ్లికి ముందే కుటుంబ ఆభరణాలను అప్పగించారు 

    నేటికీ మన సమాజంలో చాలా చోట్ల, పెళ్లి తర్వాత తమ కోడలు ఆభరణాలను తమ దగ్గర ఉంచుకుంటారు, అయితే నీత నుండి ఆమె కుమార్తె ఇషా వరకు అందరూ తమ నగలను రాధికకు ధరించడానికి ఇచ్చారు.

    వీరి మధ్య ఎంత ప్రేమ ఉందో దీన్నిబట్టి అర్థమవుతుంది.

    #5

    వెడ్డింగ్ కార్డ్స్‌లో కూడా మహిళల దృష్టిని ఆకర్షించారు 

    అనంత్, రాధిక పెళ్లి కార్డ్ రివీల్ అయిన వెంటనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే, సంప్రదాయవాదులు లేదా పితృస్వామ్య ఆలోచన ఉన్న వ్యక్తులు ఈ వివాహ కార్డును ఎక్కువగా ఇష్టపడకపోవచ్చు.

    వాస్తవానికి, పేర్లు వ్రాసిన అన్ని జంటలలో, శ్రీ బదులు శ్రీమతి మొదటి స్థానాన్ని పొందింది.

    ముందుగా తమ పేర్లను రాసి మహిళల పట్ల గౌరవం చూపిన తీరు అభినందనీయం. ఇటువంటివి చాలా అరుదుగా కనిపిస్తాయి.

    సమాచారం 

    జూలై 12న అనంత్-రాధిక పెళ్లి  

    జూలై 12న అనంత్, రాధిక ఒకరికొకరు కానున్నారు. వీరి పెళ్లిలో మూడు రోజుల పాటు మూడు కార్యక్రమాలు జరగనున్నాయి. జులై 14న గ్రాండ్‌ వెడ్డింగ్‌ రిసెప్షన్‌ ఉండగా, ముందుగా శుభారంభం, ఆపై జులై 13న శుభప్రదం జరగనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అనంత్ అంబానీ

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    అనంత్ అంబానీ

    Gautam Singhania: 'అంబానీనే కాపాడారు'.. గౌతమ్ సింఘానియా భార్య సంచలన ఆరోపణలు వ్యాపారం
    Anant Ambani: ప్రీ వెడ్డింగ్ వేడుకలను అందుకే జామ్‌నగర్‌లో జరుపుకుంటున్నా: అనంత్ అంబానీ  గుజరాత్
    Anant ambani: అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్.. దాండియా ఆడిన ధోని- బ్రావో  ఎంఎస్ ధోని
    Ram Charan : రామ్ చరణ్‌తో 'నాటు నాటు' పాటకు స్టెప్పులేసిన సల్మాన్, షారూఖ్, అమీర్  రామ్ చరణ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025