Page Loader
ఆస్కార్ అవార్డ్ గ్రహీత, హాలీవుడ్ నటుడు అలన్ అర్కిన్ కన్నుమూత 
అలన్ అర్కిన్ కన్నుమూత

ఆస్కార్ అవార్డ్ గ్రహీత, హాలీవుడ్ నటుడు అలన్ అర్కిన్ కన్నుమూత 

వ్రాసిన వారు Sriram Pranateja
Jul 01, 2023
10:00 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు అలన్ అర్కిన్ 89ఏళ్ళ వయసులో కన్నుమూశారు. క్యాచ్ 22, ఎడ్వర్డ్స్ సిసర్ హ్యాండ్స్, లిటిల్ మిస్ సన్ షైన్ చిత్రాల ద్వారా ఎనలేని గుర్తింపు తెచ్చుకున్న ఆయన శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. 65ఏళ్ళుగా నటిస్తున్న అలన్ అర్కిన్ ఎన్నో చిత్రాల్లో, వివిధ పాత్రల్లో కనిపించారు. ఆస్కార్, ఎమ్మీ అవార్డులను సొంతం చేసుకున్నారు. అలన్ మరణించిన విషయాన్ని ఆయన కుమారులు మీడియాకు తెలియజేసారు. కెమెరా ముందు ఆయన ఎంత గొప్ప నటుడో, కెమెరా వెనకాల ఆయన అంత మంచి తండ్రి అని ఆయన కుమారులు చెప్పుకొచ్చారు. అలన్ మృతిపట్ల హాలీవుడ్ నటులు సంతాపం ప్రకటించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అలన్ మృతిపై హాలీవుడ్ నటి నటాషా సంతాపం