పాప్ సింగర్ మడోన్నాకు అస్వస్థత: ఐసీయూలో ఉన్న హాలీవుడ్ గాయని
పాప్ సింగర్ మడోన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హాలీవుడ్ లో ఆమె పాటలు ఎంత ఫేమస్సో అందరికీ తెలుసు. 64ఏళ్ళ వయసులో ఉన్న మడోనా, సడెన్ గా అస్వస్థతకు గురయ్యారు. అపస్మారక స్థితిలో ఉన్న మడోన్నాను అమెరికాలోని న్యూయార్క్ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం మడోన్నా ఐసీయూలో ఉంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగా మడోన్నా అస్వస్థతకు గురయ్యిందని ఆమె మేనేజర్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వైద్యానికి ఆమె శరీరం బాగానే స్పందిస్తుందని, అయినా కూడా కోలుకోవడానికి సమయం పట్టవచ్చని మేనేజర్ తెలిపారు. మడోనా అనారోగ్యం కారణంగా, ఆమె షెడూల్స్ అన్నీ క్యాన్సిల్ అవుతాయని, కొత్త షెడ్యూల్స్ తేదీలను మళ్ళీ విడుదల చేస్తామని మేనేజర్ అన్నారు.