
అవతార్ సీక్వెల్స్ పై లేటెస్ట్ అప్డేట్: అవతార్ 3 ఎప్పుడు వస్తుందంటే?
ఈ వార్తాకథనం ఏంటి
హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ సృష్టించిన వెండితెర అద్భుతం అవతార్ సినిమాతో ప్రపంచ సినిమా నివ్వెరపోయింది. అప్పటివరకూ సిల్వర్ స్క్రీన్ పై అలాంటి ప్రపంచం చూడని ప్రేక్షకులు నోళ్ళు తెరిచి చూస్తూ ఉండిపోయారు.
2009లో రిలీజైన అవతార్ సినిమాకు 2022లో అవతార్ ద వే ఆఫ్ వాటర్ అనే పేరుతో సీక్వెల్ రిలీజైంది. ఈ సీక్వెల్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
అయితే ప్రస్తుతం అవతార్ 3 సినిమా గురించి చర్చ నడుస్తోంది. అవతార్ మొదటి భాగం రిలీజ్ అయినపుడు, తన తర్వాతి సినిమాలన్నీ అవతార్ సీక్వెల్స్ ఉంటాయని జేమ్స్ కామెరూన్ వెల్లడి చేసాడు.
అందులో భాగంగానే అవతార్ 3సినిమా మీద డిస్కషన్ జరుగుతోంది.
Details
అవతార్ 4,5భాగాలకు మారనున్న దర్శకుడు
హాలీవుడ్ వెబ్ సైట్ అయిన వెరైటీ ప్రచురించిన కథనం ప్రకారం, అవతార్ 3 సినిమా 2025 డిసెంబరు 19న రిలీజ్ అవనుందట. అలాగే 2029 డిసెంబర్ 21న అవతార్ నాలుగవ భాగం, అవతార్ ఐదవ భాగాన్ని 2031 డిసెంబర్ 19వ తేదీన రిలీజ్ అవుతాయట.
అంటే, అవతార్ సినిమా వచ్చిన 22సంవత్సరాల తర్వాత అవతార్ సినిమా చివరి సీక్వెల్ రిలీజ్ అవుతుందన్నమాట.
ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, అవతర్ 4,5భాగాలకు జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించే అవకాశం లేదని అంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.
ఏది ఏమైనా అవతార్ సిరీస్ ను ఎంతగానో ఇష్టపడేవారికి వాటి రిలీజ్ తేదీలు బయటకు రావడం ఆనందించదగ్గ విషయమే.