
upcoming telugu movies: ఉగాది సందడిలో సినిమాల హంగామా.. థియేటర్, ఓటీటీ రిలీజ్‌లివే!
ఈ వార్తాకథనం ఏంటి
ఈసారి తెలుగు సంవత్సరాది, రంజాన్ ఒకే సీజన్‌లో రావడంతో థియేటర్లు హౌస్‌ఫుల్ అయ్యేందుకు సిద్ధమవుతున్నాయి.
తెలుగు, ఇతర భాషా చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రావడమే కాకుండా, ఓటిటి వేదికలపై కూడా సరికొత్త కంటెంట్ స్ట్రీమింగ్ కానుంది.
యాక్షన్, ఎమోషన్, పాలిటిక్స్ - 'ఎల్ 2: ఎంపురాన్'
యాక్షన్, ఎమోషన్, పాలిటిక్స్, ఎంటర్‌టైన్‌మెంట్ కలగలిపిన చిత్రం 'ఎల్ 2: ఎంపురాన్'.
పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
'లూసిఫర్'కు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాలో స్టీఫెన్, ఖురేషిల జీవిత విశేషాలను ఆవిష్కరించనున్నారు.
Details
విక్రమ్ నుంచి మరో మాస్ యాక్షన్ మూవీ
చియాన్ విక్రమ్ ప్రధాన పాత్రలో రూపొందిన యాక్షన్ చిత్రం 'వీర ధీర శూర'. ఈ సినిమాలో దుషారా విజయన్, ఎస్.జె. సూర్య కీలక పాత్రల్లో నటించారు.
ఎస్.యు. అరుణ్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 27న విడుదల కానుంది.
బలమైన భావోద్వేగాలతోపాటు ఇంటెన్స్ యాక్షన్ సీన్స్ ఉంటాయని చిత్ర బృందం చెబుతోంది.
'రాబిన్‌హుడ్'గా వచ్చేస్తున్న నితిన్
నితిన్ కథానాయకుడిగా, శ్రీలీల కథానాయికగా రూపొందిన చిత్రం 'రాబిన్‌హుడ్'. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
వినోదం, సందేశం కలిపిన వినూత్నమైన కథతో ఈ సినిమా వస్తుందని మేకర్స్ పేర్కొంటున్నారు.
Details
మ్యాడ్ టీమ్ నుంచి డబుల్ ఫన్ - 'మ్యాడ్ స్క్వేర్'
'మ్యాడ్' సినిమాతో అలరించిన దర్శకుడు కల్యాణ్ శంకర్ ఇప్పుడు 'మ్యాడ్ స్క్వేర్'తో మరోసారి నవ్వులు పంచేందుకు సిద్ధమయ్యాడు.
నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మార్చి 28న విడుదల కానుంది. 'మ్యాడ్' కన్నా ఇది పది రెట్లు ఎక్కువ ఫన్‌తో ఉంటుందని చిత్రబృందం అంటోంది.
సల్మాన్ ఖాన్ నుంచి మరో భారీ యాక్షన్ మూవీ
సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా, ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సికందర్' సినిమా రంజాన్ కానుకగా మార్చి 30న విడుదల కానుంది.
రష్మిక మందన్నా కథానాయికగా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలతో భారీ అంచనాలను పెంచుతోంది.
Details
ఈ వారం ఓటిటిలో వచ్చే సినిమాలివే
నెట్‌ఫ్లిక్స్
మిలియన్ డాలర్ సీక్రెట్ (రియాలిటీ షో) - మార్చి 26
అమెజాన్ ప్రైమ్
హాలెండ్ (ఇంగ్లీష్) - మార్చి 27
జియో హాట్‌స్టార్
ముఫాసా: ద లయన్ కింగ్ (హిందీ/తెలుగు) - మార్చి 26
జీ5
విడుదల పార్ట్-2 (హిందీ) - మార్చి 28
ఆహా
ది ఎక్స్‌టార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్ (తెలుగు) - మార్చి 26
ఈ వారం థియేటర్లు, ఓటీటీలు అద్భుతమైన కంటెంట్‌తో సందడి చేయబోతున్నాయి. మీరు ఎలాంటి సినిమాలు ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు?