
Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్ 83వ బర్త్‌డే.. బిగ్‌బి ఆస్తుల విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ శనివారం (అక్టోబర్ 11) తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ రోజుతో ఆయన 82 ఏళ్లు పూర్తి చేసి 83వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు బిగ్ బీకి శుభాకాంక్షలు, అభినందనలు అందిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ ఎంతోకాలంగా సినిమాల్లో నటిస్తూ, కౌన్ బనేగా కరోడ్‌పతి వంటి టీవీ రియాలిటీ షోల్లో పాల్గొని, ప్రకటనల్లో కూడా నటిస్తూ వస్తున్నారు. ఒక్కో ప్రాజెక్ట్‌కు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్న బిగ్ బీకి సోషల్ మీడియాలో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అమితాబ్ బచ్చన్ బాగానే ఆస్తులు సొంతం చేసుకున్నారు. ఆయనకు భారతదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ప్రాపర్టీలు ఉన్నాయి.
Details
విదేశాల్లో కూడా ఆస్తులు
గతంలో జయా బచ్చన్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు, అమితాబ్ బ్యాంక్ బ్యాలెన్స్ సుమారు 200 కోట్లు ఉండగా, మొత్తం ఆస్తుల విలువ 1570 కోట్లుగా నమోదైంది. ఇప్పుడు ఈ ఆస్తులు మరింత పెరిగినట్లు సమాచారం. ముంబైలో అమితాబ్ బచ్చన్ పేరు మీద లగ్జరీ బంగ్లాలు ఉన్నాయి. కుమారుడు అభిషేక్ బచ్చన్‌తో కలిసి ముంబైలో జల్సా, జనక్, వత్స, ప్రతీక్ష వంటి బంగ్లాలు కొనుగోలు చేశారు. వీటిలో 'ప్రతీక్ష'ను తన కుమార్తె శ్వేతకు బహుమతిగా ఇచ్చారు. ఇండియాలోనే కాదు, విదేశాల్లో కూడా అమితాబ్ బచ్చన్‌కు లగ్జరీ విల్లాలు ఉన్నాయి. దుబాయ్‌కి వెళితే బిగ్ బీ ఈ ఇంట్లోనే ఉంటారు. ఈ విల్లాలో విశాలమైన గోల్ఫ్ క్లబ్, స్విమ్మింగ్ పూల్ సౌకర్యాలు కూడా ఉన్నాయి.