
'బ్లూ టిక్'పై అమితాబ్ బచ్చన్ ఫన్నీ ట్వీట్; సోషల్ మీడియాలో వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
సబ్‌స్క్రిప్షన్ చెల్లించిన ప్రముఖల ఖాతాల నుంచి 'బ్లూ టిక్'ను ట్విట్టర్ తొలగించిన విషయం తెలిసిందే.
అందులో దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ కూడా తన ట్విట్టర్ బ్లూ టిక్‌ను కోల్పోవాల్సి వచ్చింది.
అయితే శుక్రవారం అమితాబ్ తన ట్విట్టర్‌లో ఖాతాకు బ్లూ టిక్‌ను తిరిగి పొందేందుకు సబ్‌స్క్రిప్షన్ చెల్లించారు.
ఈ సందర్భంగా అమితాబ్ తన బ్లూ టిక్‌ను పునరుద్ధరించమని అభ్యర్థిస్తూ ఫన్నీ ట్వీట్‌ను పోస్ట్ చేశారు.
తాను సబ్‌స్క్రిప్షన్ చెల్లించానని, దయచేసి బ్లూ టిక్‌ను తిరిగి చేర్చాలని అమితాబ్ కోరారు. తద్వారా తాను అమితాబ్ అని ప్రజలకు తెలుస్తుందని చెప్పారు.
ఇందుకోసం తాను చేతులు జోడించి అడుగుతున్నానని, బ్లూ టిక్ కోసం నీ కాళ్ల మీద పడాలా? అని బచ్చన్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
అమితాబ్
అభిమానులు ఫన్నీగా కామెంట్స్
అయితే అమితాబ్ బచ్చన్ చేసిన ట్వీట్‌కు సోషల్ మీడియాలో అభిమానులు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు.
బ్లూ టిక్ కావాలంటే సహనం కావాలని ఒకరు ట్వీట్ చేశారు. మరో మూడు, నాలుగు రోజులు ఆగాలని మరొకరు రిప్లే ఇచ్చారు.
మిస్టర్ బచ్చన్, అతను (ఎలోన్ మస్క్) విదేశీయుడు, ఎవరి మాటా వినడని, మీరు కొన్ని రోజులు వేచి ఉండాలని ఇంకోకరు ఫన్నీగా వ్యాఖ్యానించాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
'బ్లూ టిక్'పై అమితాబ్ బచ్చన్ ఫన్నీ ట్వీట్
T 4623 - ए twitter भइया ! सुन रहे हैं ? अब तो पैसा भी भर दिये हैं हम ... तो उ जो नील कमल ✔️ होत है ना, हमार नाम के आगे, उ तो वापस लगाय दें भैया , ताकि लोग जान जायें की हम ही हैं - Amitabh Bachchan .. हाथ तो जोड़ लिये रहे हम । अब का, गोड़वा 👣जोड़े पड़ी का ??
— Amitabh Bachchan (@SrBachchan) April 21, 2023