
Chandra Barot: అమితాబ్ 'డాన్' దర్శకుడు చంద్ర బారోట్ ఇకలేరు
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయ సినిమా పరిశ్రమ మరో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు చంద్ర బారోట్ (వయసు 86) ఆదివారం కన్నుమూశారు. పల్మనరీ ఫైబ్రోసిస్ తో ఏడు సంవత్సరాలుగా పోరాడుతూ చివరకు గురునానక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన భార్య దీపా బారోట్ ఈ విషయం వెల్లడించారు. గతంలో జస్లోక్ ఆసుపత్రిలోనూ ఆయనకు చికిత్స కొనసాగింది. చంద్ర బారోట్ పేరు వినగానే సినిమా ప్రేమికుల మదిలో ఠక్కున గుర్తొచ్చే చిత్రం 'డాన్' (1978). బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ నటనకు మైలురాయిగా నిలిచిన ఈ సినిమాతోనే చంద్ర బారోట్ దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. అప్పట్లో ఈ చిత్రం రూ. 7 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది.
Details
ప్రముఖుల సంతాపం
'డాన్' సినిమా తర్వాత కూడా ఆయన కెరీర్‌లో కొన్ని కీలక దశలు చోటు చేసుకున్నాయి. 1970లో వచ్చిన 'పురబ్-పశ్చిమ్' చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన చంద్ర బారోట్ తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆపై మూడు చిత్రాలకు అసిస్టెంట్‌గా పనిచేశారు. 1978లో డాన్‌తో దర్శకుడిగా అరంగేట్రం చేసిన ఆయన, 1989లో బెంగాలీ చిత్రం 'ఆశ్రిత'కు దర్శకత్వం వహించారు. ఈ సినిమా సుమారు రూ. 3 కోట్ల వసూళ్లను నమోదు చేసింది. తర్వాత 1991లో 'ప్యార్ భర్ దిల్' అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే బాలీవుడ్‌లో 'డాన్' సిరీస్‌లో షారుక్ ఖాన్ హీరోగా రెండు సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే.ఇప్పుడు 'డాన్-3' రూపొందుతోంది. ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు.