Lavanya Tripathi: అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ రోజున లావణ్య త్రిపాఠి సంప్రదాయ లుక్
అయోధ్యలో వందల ఏళ్ల నాటి కలను సాకారం చేస్తూ చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది.రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం అంబరాన్నంటింది.ఈ మహత్తర సందర్భంలో యావత్ దేశం ఆనందించింది. ఈ నేపథ్యంలో మెగాకోడలు లావణ్య త్రిపాఠి ఓఆసక్తికర పోస్ట్ చేశారు.తానూ కూడా శ్రీరాముని దివ్య నివాసమైన అయోధ్యలోనే పుట్టారని అన్నారు. అందుకే తనకి అయోధ్య అంటే ప్రత్యేక అభిమానమని చెప్పారు. ఈ క్రమంలో రామ్ పరివార్ ఆభరణాలతో,లావణ్య అందమైన సంప్రదాయ లుక్ లో చీరను ధరించి,ఫోటో షూట్ చేసి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ఆమె పోస్ట్ చేసిన పిక్స్ ఇప్పుడు వైరల్ అయ్యాయి. ఇకపోతే,లావణ్య త్వరలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం కానున్న వెబ్ సిరీస్ మిస్ పర్ఫెక్ట్‌లో ప్రేక్షకులను అలంకరించడానికి సిద్ధంగా ఉంది.