మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి: నో నో నో అంటూ అప్డేట్ ఇచ్చేసారు
ఈ వార్తాకథనం ఏంటి
అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి హీరోహీరోయిన్లుగా వస్తున్న చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజైనప్పటి నుండి మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
దానికన్నా ముందు ఈ సినిమాపై అప్డేట్ల విషయంలో నవీన్ పొలిశెట్టి చేసిన వీడియో, చాలామందిని ఆకర్షించింది. అప్డేట్ అప్డేట్ అని అందరూ అడుగుతున్నట్లు ఆ వీడియోలో చూపించాడు నవీన్ పొలిశెట్టి.
ఇప్పుడు మరోసారి అప్డేట్ అడుగుతూనే అప్డేట్ ఇచ్చేసాడు. అవును, ఉగాది సందర్భంగా ఈ సినిమాలోంచి మొదటి పాటను రిలీజ్ చేస్తున్నామని నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ప్రకటించింది.
నో నో నో అంటూ సాగే పాటను రిలీజ్ చేస్తున్నామని క్రియేటివ్ గా అప్డేట్ ఇచ్చారు.
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి
స్నేహం నో, మోహం నో బంధం నో, అనుభంధం నో
పూర్తి సాంగ్ ని రేపు రిలీజ్ చేస్తున్నామని తెలిపారు గానీ ఏ టైమ్ లో చేస్తామనేది వెల్లడి చేయలేదు. కాకపోతే నో నో నో అంటూ పాటను పరిచయం చేసారు.
నీ స్నేహం నో నో నో, నీ మోహం నో నో నో, నీ బంధం నో నో నో, అనుబంధం నో నో నో అంటూ సాగే పాట ఆసక్తిగా, పాడుకోవడానికి వీలుగా ఉంది.
రాధాన్ సంగీతం అందించిన ఈ పాట, మాంచి హిట్ అయ్యే సూచనలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. తెలుగులోనే కాదు, అటు తమిళంలోనూ ఈ పాటను రేపే రిలీజ్ చేస్తున్నారు.
యువీ క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ చిత్రానికి మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రిలీజ్ కాబోతున్న నో నో నో పాట
A song every music lover will say yes, yes and yes to🎵🎵#NoNoNo lyrical song from #MissShettyMrPolishetty releasing tomorrow 🥁
— UV Creations (@UV_Creations) March 21, 2023
Stay tuned… @MsAnushkaShetty @NaveenPolishety @filmymahesh @radhanmusic #NiravShah #RajeevanNambiar #KotagiriVenkateswararao pic.twitter.com/tnDJcqGPIm