ఇంటి పేర్లనే సినిమా టైటిల్ గా మార్చేసిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి
ఈ వార్తాకథనం ఏంటి
అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి కలిసి నటిస్తున్న సినిమా నుండి అప్డేట్లు రాక అభిమానులు ఆగమయ్యారు. ఈ అప్డేట్ల విషయమై నవీన్ పొలిశెట్టి ఒక చిన్న వీడియో కూడా చేసాడు.
అది అందరినీ నవ్వించింది. కానీ అదే టైమ్ లో సినిమా నుండి అప్డేట్ అంత తొందరగా రాకపోవడంతో కొంత నిరాశ చెందారు. కానీ ఇప్పుడు నిరాశ చెందాల్సిన పనిలేదు.
అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి.. తమ ఇంటిపేర్లతోనే వచ్చేసారు. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి అనే టైటిల్ తో వచ్చారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా చిత్ర నిర్మాణ సంస్థ, సినిమా పేరును ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది.
ఈ పోస్టర్లో ఆసక్తికర అంశాలు చాలానే ఉన్నాయి.
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి
అనుష్క హ్యాపీ సింగిల్, నవీన్ రెడీ టు మింగిల్
టైటిల్ పోస్టర్ ని చూస్తే రెండు పాత్రలవి రెండు వేరు వేరు ప్రపంచాలుగా అర్థమవుతోంది. అనుష్క పాత్ర ఫారెన్ లో ఉంటే నవీన్ పొలిశెట్టి పాత్ర హైదరాబాద్ లో ఉన్నట్టు చూపించారు.
అనుష్క చేతిలో ఉన్న పుస్తకం, పెళ్ళి చేసుకోకుండా ఒంటరిగా ఉండడం హ్యాపీగా ఉందని చూపిస్తుంటే, నవీన్ పాత్ర వేసుకున్న డ్రెస్ మీదున్న రాతలు.. ఒంటరిగా ఉండలేక కలిసిపోవాలన్నట్టుగా చూపిస్తున్నాయి.
పరస్పరం విరుద్ధ భావాలున్న ఇద్దరూ ఎలా కలుసుకున్నారు? వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంఘటనలు, సంభాషణలు ఏంటన్నది తెలియాలంటే రిలీజయ్యే వరకు ఆగాల్సిందే.
తెలుగు, కన్నడ, తమిళం, మళయాలం భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. వేసవిలో విడుఅల చేయాలని చూస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అనుష్క శెట్టి కొత్త చిత్రం టైటిల్ విడుదల
Introducing our most favourite combo; #MissShettyMrPolishetty to you all🤩
— UV Creations (@UV_Creations) March 1, 2023
Get ready for a Rollercoaster ride of Entertainment this Summer@MsAnushkaShetty @NaveenPolishety @filmymahesh @radhanmusic #NiravShah #RajeevanNambiar #KotagiriVenkateswararao @UV_Creations @adityamusic pic.twitter.com/mkG8bWrMnz