అనుష్క లుక్ చూసి అయోమయంలో అభిమానులు
అనుష్క శెట్టి.. టాలీవుడ్ కి పరిచయమై 15ఏళ్ళకు పైనే అయ్యింది. అయినా కూడా ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉంది. సాధారణంగా హీరోయిన్లకు అంత పెద్ద కెరీర్ ఉండదు. ఈ విషయంలో అనుష్క శెట్టి ప్రత్యేకమనే చెప్పాలి. అనుష్కా శెట్టికి ఇప్పటికీ అభిమానులు ఉన్నారు. ఆమె నుండి సినిమా రావాలని కోరుకుంటున్నారు. ఎదురుచూస్తున్నారు కూడా. ఐతే తాజాగా అనుష్క శెట్టి మీడియాకు చిక్కింది. మహాశివరాత్రి సందర్భంగా కర్ణాటకలో ఒక గుడికి వచ్చిన అనుష్క, అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అనుష్కను చూసిన వారందరూ అయోమయంలో ఉన్నారు. దానికి కారణం ఆమె సాధారణంగా కంటే కొద్దిగా లావుగా కనిపించడమే. గతంలో కనిపించిన దానికంటే మరింత లావుగా అనుష్క శెట్టి కనిపించడంతో ప్రేక్షకులు షాక్ అవుతున్నారు.
సైజ్ జీరో తర్వాత బరువు తగ్గడంలో మొదలైన ఇబ్బందులు
బాహుబలి సినిమా సమయంలో సైజ్ జీరో అనే మూవీలో కనిపించింది అనుష్క. ఆ సినిమా కోసం చాలా బరువు పెరగాల్సి వచ్చింది. కొన్ని ఆరోగ్య కారణాల వల్ల బరువు తగ్గడం కుదరట్లేదని అప్పట్లో అనుష్క శెట్టి చెప్పుకొచ్చింది. ఆ కారణాలు ఇప్పటికీ ఆమెను వెంటాడుతున్నాయని అర్థమవుతోంది. అనుష్క శెట్టి ప్రస్తుతం యూవీ బ్యానర్ లో నటిస్తోంది. జాతిరత్నాలు ఫేమ్ నవీన్ పోలిశెట్టి హీరోగా వస్తున్న ఈ సినిమాలో అనుష్క శెట్టి హిరోయిన్ గా కనిపిస్తుంది. ఈ సినిమా టైటిల్ ఏంటనేది ఇంతవరకు ప్రకటించలేదు. కాకపోతే ఇందులో ఆమె ఛెఫ్ గా కనిపిస్తుందని, అన్విత రవళి శెట్టి పాత్ర పేరుతో ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసారు.