NBK 111: బాలయ్య-గోపీచంద్ మలినేని మూవీకి ఊహించని ట్విస్ట్.. కథే మార్చేశారా?
ఈ వార్తాకథనం ఏంటి
బ్యాక్ టు బ్యాక్ ఐదు సినిమాలతో బ్లాక్‌బస్టర్ విజయాలు అందుకుంటూ నందమూరి నటసింహం బాలకృష్ణ మరోసారి తన మార్కెట్ స్థాయిని నిరూపించాడు. 'అఖండ' నుంచి ఇటీవల విడుదలైన 'అఖండ 2' వరకు వరుసగా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఆయన, ఇప్పుడు తదుపరి ప్రాజెక్ట్‌పై దృష్టి సారించాడు. 'వీరసింహారెడ్డి' విజయవంతమైన కాంబినేషన్‌ను మరోసారి రిపీట్ చేస్తూ మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో బాలయ్య భారీ ప్రాజెక్ట్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఎన్‌బీకె 111 (NBK 111) అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం.
Details
కథలో మార్పులు జరిగినట్లు రూమర్లు
ప్రారంభంలో ఈ చిత్రం మాస్ యాక్షన్‌తో పాటు రెండు వేర్వేరు కాలాలకు చెందిన హిస్టారికల్ కథాంశంతో చరిత్రను-వర్తమానాన్ని ముడిపెట్టే ఎపిక్ స్టోరీగా రూపొందనున్నట్లు ప్రచారం జరిగింది. ఒకరకంగా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌కు దగ్గరగా ఉండే కథ అని, బాలకృష్ణను మునుపెన్నడూ చూడని పాత్రలో చూపించబోతున్నారన్న టాక్ కూడా వినిపించింది. అయితే, సినిమా సెట్స్‌పైకి వెళ్లే సమయానికి దగ్గర పడుతున్న వేళ కథలో మార్పులు జరిగాయనే రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మొదట అనుకున్న హిస్టారికల్ కథను పక్కన పెట్టి, మరో కొత్త కథతో సినిమా తెరకెక్కించనున్నారన్న ప్రచారం జరుగుతోంది. హిస్టారికల్ సినిమాకు ఎక్కువ సమయం పట్టడంతో పాటు బడ్జెట్ కూడా భారీగా అవుతుందనే కారణంతోనే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
Details
అధికారిక ప్రకటన రావాల్సి ఉంది
ఇప్పటికే గోపీచంద్ మలినేని, బాలకృష్ణకు కొత్త కథా లైన్‌ను వినిపించగా, బాలయ్య కూడా దానికి ఓకే చెప్పినట్టుగా టాక్ వినిపిస్తోంది. మరోవైపు, పూర్తిగా కథ మార్చకుండా బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకొని హిస్టారికల్ కథలోనే మార్పులు చేసి రీ రైట్ చేశారని మరో వెర్షన్ ప్రచారంలో ఉంది. అయితే, కొన్ని మార్పులతోనే కాదు.. కథ మొత్తం మారిపోయిందన్న మాట కూడా వినిపిస్తోంది. ఈ అన్ని ప్రచారాలపై స్పష్టత రావాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు వేచిచూడాల్సిందే. అధికారిక ప్రకటన వచ్చేవరకు NBK 111పై ఆసక్తి, ఉత్కంఠ మరింత పెరుగుతుందనే చెప్పాలి.