Naveen Polishetty : నవీన్ స్టైల్‌లో 'అనగనగా ఒక రాజు' ప్రీ వెడ్డింగ్ ప్రోమో అదిరిపోయింది
టాలీవుడ్ నవీన్ పొలిశెట్టి తన తొలి సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతోనే హీరోగా భారీ విజయాన్ని అందుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత జాతి రత్నాలు సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాడు. ఇక లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టితో కలిసి నటించిన మిస్టర్ శెట్టి.. మిసెస్ పోలిశెట్టి సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఆ చిత్ర విజయానంతరం నవీన్ కొంత విరామం తీసుకుని ఇప్పుడు అనగనగా ఒక రాజు అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రారంభమై చాలాకాలం అయినe ఇంకా షూటింగ్ కొనసాగుతూనే ఉంది.
ఆకట్టుకున్న వీడియో
ఈరోజు నవీన్ పోలిశెట్టి పుట్టినరోజు సందర్బంగా అనగనగా ఒక రాజు నుంచి ఒక ప్రత్యేక ప్రీ-వెడ్డింగ్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో నవీన్ ముకేశ్ మావయ్యతో వీడియో కాల్ చేస్తూ తనదైన శైలిలో వినోదభరితంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ముకేశ్ మావయ్యతో మాట్లాడుతూ మావయ్య నీకు వంద రీఛార్జ్‌లు చేసాను, ఇప్పుడే మన అనంత్ వెడ్డింగ్ క్యాసెట్ చూస్తున్నాను, నువ్వు కాల్ చేసావు అంటూ నవీన్ సరదాగా చెప్పాడు. ఇక చివర్లో నవీన్ అనంత్ పెళ్లి అయిపోయిందా? ఇంకా రెండు సీజన్లు మిగిలి ఉన్నాయా? అంటూ చమత్కారంగా ముగించాడు. ఈ వీడియో నవీన్ పోలిశెట్టి అభిమానులను ఆకట్టుకునేలా ఉంది. ఆయన తనదైన హాస్యభరిత నటనతో మరోసారి ప్రేక్షకుల మనసును గెలుచుకున్నారని చెప్పొచ్చు.