Anant Nag: ప్రముఖ కన్నడ నటుడు అనంత్ నాగ్‌కు ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ కన్నడ నటుడు అనంత్ నాగ్‌ను 2024 సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. భారతీయ చలనచిత్ర రంగానికి ఆయన అందించిన విశేష సేవలు, అద్భుతమైన సినీ ప్రస్థానాన్ని గుర్తిస్తూ ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కమిటీ చేసిన సిఫార్సు మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించింది. ఈనెల 22న గుజరాత్‌లోని కేవాడియాలో నిర్వహించనున్న 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అనంత్ నాగ్ ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అనంత్ నాగ్‌కు అభినందనలు తెలిపిన ప్రధాని
Congratulations to the legendary Anant Nag Ji on being conferred the Dadasaheb Phalke Award.
— Narendra Modi (@narendramodi) September 16, 2026
For several decades, his effortless performances, remarkable versatility and brilliance have left a very strong mark on Indian cinema, particularly Kannada cinema. In whichever role he…