Page Loader
Anant-Radhika wedding: అనన్య పాండే అలా చేసిందేంటి.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు
అనన్య పాండే అలా చేసిందేంటి.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు

Anant-Radhika wedding: అనన్య పాండే అలా చేసిందేంటి.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు

వ్రాసిన వారు Stalin
Jul 13, 2024
03:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జులై 12న వీరిద్దరికి పెళ్లయింది. వీరి వివాహానికి దేశ, విదేశాల నుండి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. బాలీవుడ్‌కి చెందిన స్టార్‌కిడ్స్ కూడా పెళ్లిలో చాలా వినోదాన్ని సృష్టించారు. అదే సమయంలో, ఒక స్టార్ కిడ్ ఎక్కువగా ట్రోల్ అవుతోంది ఆమె ఎవరో కాదు .. అనన్య పాండే. ఈ ట్రోల్ కి గల కారణం కూడా ఇప్పుడు తెలుసుకుందాం.

వివరాలు 

నిక్ జోనాస్‌ని నెట్టేసిన అనన్య 

ఈ వివాహానికి ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ కూడా హాజరయ్యారు. పెళ్లి నుండి నిక్ కి సంబందించిన వీడియో బయటపడింది. దీనిని చూసిన చాలా మంది అభిమానులు ఇప్పుడు కోపంగా ఉన్నారు. ప్రియాంక-నిక్ డాన్స్ చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా వెనుక నుండి నిక్‌ని పక్కకు నెట్టింది. అప్పుడు నిక్ వెనక్కు నిల్చొన రణ్‌వీర్ సింగ్ అతడ్ని తనవైపు లాక్కున్నాడు. కాగా,సోషల్ మీడియాలో అభిమానులు అనన్యపై విమర్శలు గుప్పిస్తున్నారు. అదే సమయంలో రణ్‌వీర్‌ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో ఇదే