Page Loader
Anasuya : ఎక్స్‌పోజ్ పై అనసూయ రచ్చ..అంత ఈజీ కాదని నెటిజన్‌కు కౌంటర్
Anasuya : ఎక్స్‌పోజ్ పై అనసూయ రచ్చ..అంత ఈజీ కాదని నెటిజన్‌కు కౌంటర్

Anasuya : ఎక్స్‌పోజ్ పై అనసూయ రచ్చ..అంత ఈజీ కాదని నెటిజన్‌కు కౌంటర్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Oct 30, 2023
02:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

అనసూయ భరద్వాజ్, ఈ పేరు వింటేనే కుర్రకారులో ఎదో తెలియని అలజడి. బుల్లితెర యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ హాట్ భామ, ప్రస్తుతం వెండితెరపై రాణిస్తోంది. వరుస సినిమాలతో ఖాళీ లేకుండా గడిపేస్తోంది. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటోంది. మహానటి సావిత్రిలా నటించడం ఎంత కష్టమో, ఎక్స్‌పోజింగ్ చేయడం అంతే కష్టమని రాసుకొచ్చింది. తాజాగా అనసూయ ఓ తెలుగు ఛానెల్ ఏర్పాటు చేసిన అవార్డుల వేడుకలో పాల్గొన్నారు. ఇందులో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చేసింది. అలనాటి తారలు సావిత్రి, జమున, శ్రీదేవి, సౌందర్య నటించిన పాటలను అనసూయ రీ క్రియేట్‌ చేసి వారి గెటప్స్ తో డ్యాన్స్ చేసింది.

Details

దిగ్గజ తారలకు నివాళి అర్పించే అవకాశం అదృష్టం

నా డ్యాన్స్ పెర్ఫామెన్స్‌ తో దిగ్గజ తారలకు నివాళి అర్పించే అవకాశం వచ్చినందుకు అదృష్టంగా భావిస్తున్నట్లు ఆమె ట్వీట్ చేశారు. దీంతో చాలా మంది సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు ఓ నెటిజన్ మాత్రం అనసూయకు కౌంటర్ ఇచ్చాడు. సావిత్రిలా నటించడం అంటే ఎక్స్‌ పోజింగ్ చేేేసినంత ఈజీ కాదని ట్వీట్ చేశాడు. స్పందించిన అనసూయ, నిజం చెప్పారండీ, సావిత్రమ్మలా నటించడం ఎవరి తరం కాదని చెప్పింది. ఇదే సమయంలో ఎక్స్‌ పోజింగ్ కూడా ఈజీ కాదని, శారీరకంగా, మానసికంగా ముందస్తు సన్నద్ధం కావాలని హితబోధ చేశారు. ఏ పాత్ర చేసినా, ఏ దుస్తులు ధరించినా మన పనిని దృఢ సంకల్పంతో చెయ్యాలని సూచించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నెటిజన్ కౌంటర్ కు స్పందించిన అనసూయ