Page Loader
7/G Brindavan Colony 2: 7/G బృందావన్ కాలనీ' సీక్వెల్‌లో హీరోయిన్‌గా అనస్వరరాజన్ ?
7/G బృందావన్ కాలనీ' సీక్వెల్‌లో హీరోయిన్‌గా అనస్వరరాజన్ ?

7/G Brindavan Colony 2: 7/G బృందావన్ కాలనీ' సీక్వెల్‌లో హీరోయిన్‌గా అనస్వరరాజన్ ?

వ్రాసిన వారు Sirish Praharaju
May 15, 2025
12:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు సినీ రంగంలో ప్రేమ కథల నేపథ్యంతో ఎన్నో సినిమాలు విడుదలయ్యాయి. అయితే,వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకుల మనసులను హత్తుకున్నాయి. అలాంటి అరుదైన చిత్రాలలో ఒకటి "7/G బృందావన్ కాలనీ".ఈసినిమా ఒక అందమైన ప్రేమకథా చిత్రంగా గుర్తింపు పొందింది. ఈచిత్రానికి యుగానికి ఒక్కడు సినిమాతో దర్శకుడిగా తన ప్రత్యేకతను చాటుకున్న సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించారు. ఇందులో రవి కృష్ణ, సోనియా అగర్వాల్ ముఖ్య పాత్రల్లో నటించారు.2004లో విడుదలైన ఈచిత్రం, తమిళంలో కన్నా తెలుగులోనే ఎక్కువ విజయం సాధించింది. ఇప్పుడు ఈసినిమాకు కొనసాగింపుగా "7/G బృందావన్ కాలనీ 2"అనే సీక్వెల్ తెరకెక్కుతోంది. ఈకొత్త చిత్రానికి కూడా సెల్వ రాఘవన్ దర్శకత్వం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చాలా భాగం పూర్తయింది.

వివరాలు 

ఈచిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం

మోషన్ పోస్టర్‌ను ఇప్పటికే విడుదల చేయగా,అది మంచి స్పందనను పొందింది. ఇప్పటికే ఈ సినిమాలో కథానాయిక పాత్ర విషయంలో కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొదట్లో 'లవ్ టుడే' ఫేమ్ ఇవానా,శంకర్ కుమార్తె అదితి శంకర్‌లు ఈ సినిమాలో నటించబోతున్నారన్న వార్తలు వచ్చాయి. అయితే తాజాగా మరో నటి పేరు చర్చల్లోకి వచ్చింది. మలయాళ సూపర్ హిట్ మూవీ 'రేఖ'తో మంచి పేరు సంపాదించిన అనస్వర రాజన్ ఈ సినిమాలో కథానాయికగా నటించనున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈచిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. "7/G బృందావన్ కాలనీ 2" సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.