NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Anger Management: తరచుగా కోపమా.. 8 చిట్కాలతో కంట్రోల్‌ చేసుకోవచ్చు
    తదుపరి వార్తా కథనం
    Anger Management: తరచుగా కోపమా.. 8 చిట్కాలతో కంట్రోల్‌ చేసుకోవచ్చు
    తరచుగా కోపమా.. 8 చిట్కాలతో కంట్రోల్‌ చేసుకోవచ్చు

    Anger Management: తరచుగా కోపమా.. 8 చిట్కాలతో కంట్రోల్‌ చేసుకోవచ్చు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Dec 05, 2023
    05:50 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మీకు తరచుగా కోపం వస్తోందా. ఇతరులపై ఊరికే అసంతృప్తి రగులుతోందా. అయితే ఈ 8 చిట్కాలు మీ కోసమే.

    ప్రతి మనిషిలో అనేక రకాల భావోద్వేగాలు ఉంటాయి. అందులో కోపం కూడా ఒకటి.

    క్షమాపణ ఓ శక్తివంతమైన సాధనం.మీరు కోపం బారిన పడితే ప్రతికూల ఫలితాలను అనుభవించడంలో సందేహం లేదు.

    ఇదే సమయంలో అన్యాయం జరిగిందనే భావనతో మిమ్మల్ని మీరు బాధపెట్టుకోవటం వదిలేయాలి. మీ కోపానికి, ఆవేదనకు కారణమైన వ్యక్తిని క్షమించడం ఓ అసెట్.

    మరోవైపు మీ ఇద్దరికీ ఆ పరిస్థితుల నుంచి గుణపాఠం నేర్చుకుని, మీ బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు సహకరిస్తుంది.

    మనిషికి రోజూ రకరకాల కారణాలతో ఆగ్రహం రావడం సహజమే. కానీ అది ఎవరికీ మంచిది కాదు.

    details

    అందుకే కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే

    కోపానికి కారణం మన శరీరంలో జరిగే హార్మోన్ల మార్పులేనని ఆరోగ్య నిపుణులు. అందుకే చీటికి మాటికి కోపం వస్తూ ఉంటుంది.

    ఇలా ప్రతిసారీ కోపం తెచ్చుకోవడం మనల్ని మరింత ప్రమాదంలో పడేస్తుంది. మితిమీరిన కోపం అనేక అనర్థాలకు దారి.

    1. మాట్లాడే ముందు ఆలోచించాలి :

    క్షణంలో కోపం తెచ్చుకోవడం ఈజీ కానీ, ఆ తర్వాత మీరే పశ్చాత్తాపపడతారు. కోపంలో ఏదైనా మాట్లాడే ముందు ఒక్క సెకను ఆలోచించటం మంచిది. ఫలితంగా ఎదుటి వాళ్లను గాయపరిచే మాటలు తగ్గిపోతాయి.

    2. ప్రశాంతంగా ఉన్నప్పుడే ఆవేదన బయటపెట్టండి :

    ప్రశాంతంగా ఉన్న సమయంలోనే మీ నిరాశ, ఆవేదన, ఆందోళనను అవతలి వారికి చెప్పాలి. దీంతో ఇతరులను బాధపెట్టకుండా, మీ ఆందోళనలు, అవసరాలను స్పష్టంగా తెలియజేప్పండి.

    DETAILS

    కొన్ని విషయాలు మీ నియంత్రణలో లేవని అర్థం చేసుకోండి.

    3. విశ్రాంతి హాయినిస్తుంది :

    ఒత్తిడితో ఉన్న సమయంలో చిన్న బ్రేక్ తీసుకోండి. కొన్ని క్షణాల పాటు సైలెంట్ గా ఉండటం చిరాకు, కోపం రాకుండా ఉండేలా చేస్తాయి.

    4. కొంత వ్యాయామం అవసరం :

    శారీరక శ్రమ, ఒత్తిడిని దూరం చేస్తుంది.కోపం పెరుగుతున్నట్లు అనిపిస్తే, వేగంగా నడవండి లేదా పరుగెత్తండి. ఆనందదాయకమైన శారీరక కార్యకలాపాలు చేయండి.

    5. మీ చేతిలో లేనిది :

    మీ పిల్లల గది మిమ్మల్ని కలవరపెడితే ఆ రూమ్‌ తలుపు మూసేయండి.మీ భాగస్వామి ప్రతి రాత్రి భోజనానికి ఆలస్యంగా వస్తే సాయంత్రం తర్వాత డిన్నర్‌ని షెడ్యూల్ చేయండి.లేదా వారానికి కొన్ని సార్లు ఒంటరిగా తినడం అలవాటు చేసుకోవాలి.అలాగే, కొన్ని విషయాలు మీ నియంత్రణలో లేవని అర్థం చేసుకోండి.

    DETAILS

    ప్రశాంతత కోసం జోక్స్, ఫుడ్ లాభం చేకూర్చుతాయి

    6. టెన్షన్‌ను వదిలేసేందుకు జోక్స్‌, ఫుడ్ :

    కొంత హాస్యం మీలో ఒత్తిడిని తగ్గించడంలో ఉపయోగకరంగా నిలుస్తుంది. మీకు కోపం తెప్పించే విషయాలు ఎదురైనప్పుడు మీరు హస్యాస్పదంగా ఉండేలా చూసుకోండి. ఇష్టమైన ఆహారం తినొచ్చు.

    7. పగ సాధింపు ప్రక్రియకు దూరంగా ఉండాలి :

    క్షమాపణ శక్తివంతమైన ఆయుధం. మీరు కోపంతో ఉండటం వదిలేయాల్సిందే.

    8. రిలాక్స్ కోసం ప్రయత్నించాలి

    మీలో కోపం పెరిగినప్పుడు, రిలాక్సేషన్ టెక్నిక్స్ పై దృష్టి సారించాలి. ఈ మేరకు దీర్ఘశ్వాస వ్యాయామాలను ప్రాక్టీస్ చేయాలి.

    మ్యూజిక్‌ వినడం, మ్యూజిక్‌ ప్లేయర్‌ని ప్రాక్టీస్ చేయజం,.యోగా లాంటివి చేయవచ్చు. ఈ చిట్కాలను పాటించడం ద్వారా మీరు మీ కోపాన్ని కంట్రోల్‌ చేసుకోవడం సులభంగా చేసుకోవచ్చు. దీంతో జీవితాన్ని హాయిగా గడపవచ్చు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆహారం

    తాజా

    SYG : సంబరాల ఏటిగట్టు నుండి రవికృష్ణ అగ్రెసివ్ లుక్ విడుదల! సాయి ధరమ్ తేజ్
    Tammudu : తమ్ముడు రిలీజ్ డేట్ పై క్లారిటీ.. అనుకున్న తేదీకే విడుదల!  నితిన్
    Stock market: లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @25,100  స్టాక్ మార్కెట్
    Metro project: విశాఖ మెట్రో ప్రాజెక్టులో మరో ముందడుగు.. ADB ప్రతినిధులతో అధికారుల సమీక్ష విశాఖపట్టణం

    ఆహారం

    డెంగ్యూ నుండి రికవరీ అయ్యే సమయంలో తీసుకోవాల్సిన ఆహారాలు  జీవనశైలి
    UN Global Hunger Crisis: 10మందిలో ఒకరు ఆకలితో నిద్రపోతున్నారు: ఐరాస ఫుడ్ చీఫ్  ఐక్యరాజ్య సమితి
    బ్రేక్ ఫాస్ట్ లో ఫైబర్ తీసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ ఫుడ్స్ ట్రై చేయండి  లైఫ్-స్టైల్
    టర్కీ పర్యటనకు వెళ్తున్నారా? ఈ ఆహారాలు ఖచ్చితంగా ట్రై చేయండి  టర్కీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025