Anil Ravipudi: 'రీజనల్ రాజమౌళి'.. అది ఆయన స్థాయిని తగ్గించడమే అవుతుంది..!
ఈ వార్తాకథనం ఏంటి
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'మన శంకర వరప్రసాద్' సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు స్థాపిస్తోంది. ఈ ఘనవిజయం నేపథ్యంలో జరిగిన సక్సెస్ మీట్‌లో అనిల్ రావిపూడి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కళ్యాణ్ రామ్ నుంచి మెగాస్టార్ వరకు, అందరు హీరోలకు వారి కెరీర్‌లోనే పెద్ద హిట్లను ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి. తాజాగా నెటిజన్లు ఆయనను 'రీజనల్ రాజమౌళి'గా పిలుస్తుండటంపై అనిల్ స్పందించారు.
వివరాలు
నేను నాకు తెలిసిన టైమింగ్‌తో ఎంటర్టైనర్స్ చేసుకుంటూ వెళ్తున్నాను: అనిల్
రాజమౌళి తో నన్ను పోల్చడం అంటే నా స్థాయి పెరుగుతుంది అనుకోవడం మాత్రమే. కానీ, అది ఆయన స్థాయిని తగ్గించడం అవుతుంది. ఆయన తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్ళిన లెజెండరీ డైరెక్టర్. నేను నాకు తెలిసిన టైమింగ్‌తో ఎంటర్టైనర్స్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఆయనతో పోలిక వద్దని కోరారు. సినిమా రిలీజ్ తర్వాత వచ్చిన అభినందనల గురించి అనిల్ రావిపూడి వివరించారు.
వివరాలు
వినాయక్ ఫోన్ చేసి అప్రిసియేట్ చేశారు: అనిల్
"నిన్న రాత్రి రాజమౌళి నాకు మెసేజ్ చేసి'చాలా బాగా తీశావు'అని అభినందించారు.అది నాకు పెద్ద అవార్డు లాంటిది.అలాగే నా లవ్లీ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫోన్ చేసి సినిమా గురించి మాట్లాడారు, అందుకు ధన్యవాదాలు అని చెప్పాను.నా సినిమా రిలీజ్ రోజున మా ఇంట్లో వాళ్ల కంటే ముందే వినాయక్ ఫోన్ చేసి అప్రిసియేట్ చేశారు.సీనియర్ దర్శకులు రాఘవేంద్రరావు కూడా మెసేజ్ చేసి అభినందించారు." సినిమా కలెక్షన్స్ రేంజ్ గురించి,హీరో నితిన్ ముందే అంచనా వేసినట్టు అనిల్ తెలిపారు. "నితిన్ ఒక హీరోగా మాత్రమే కాదు,డిస్ట్రిబ్యూటర్ కొడుకుగా ఆలోచించి సినిమాకు వచ్చే వసూళ్లను ముందే చెప్పగలడు."అలాగే,రామ్ చరణ్,నితిన్,మంచు మనోజ్,సుష్మిత కొణిదెల వంటి ప్రముఖులు సినిమా చూసి వ్యక్తిగతంగా అభినందనలు తెలిపారని చెప్పారు.
వివరాలు
ఆ ఎనర్జీని ఎప్పటికీ మర్చిపోలేను: అనిల్
ప్రీమియర్ షోలలో మాస్ ఆడియన్స్తో సినిమా చూసినప్పుడు వచ్చిన ప్రతిస్పందన చూసి గూస్‌బమ్స్ వచ్చాయని, ఆ ఎనర్జీని ఎప్పటికీ మర్చిపోలేనని అనిల్ రావిపూడి ఎమోషనల్‌గా తెలిపారు.