చర్చల్లోకి సుడిగాలి సీక్వెల్: అల్లరి నరేష్ ను డైరెక్ట్ చేయబోతున్న ఎఫ్ 2 డైరెక్టర్?
అల్లరి నరేష్ తన రూటు మార్చి సీరియస్ సినిమాల వైపు వెళ్తున్నాడు. నాంది సినిమాతో మొదలైన సీరియస్ సినిమాల ప్రస్థానం, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం వరకూ వచ్చింది. మే 5వ తేదీన ఉగ్రం సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో ఉగ్రం సినిమా ప్రమోషన్లలో జోరుగా పాల్గొంటున్నాడు నరేష్. ఈ ప్రమోషన్లలో సుడిగాడు సీక్వెల్ పై చర్చ లేచింది. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన సుడిగాడు సినిమా, 2012లో రిలీజై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్ తీయొచ్చని చెప్పిన అల్లరి నరేష్, సుడిగాడు సినిమాకు రచయితగా పనిచేసిన అనిల్ రావిపూడి, సుడిగాడు సీక్వెల్ తీద్దామన్నాడని చెప్పుకొచ్చాడు.
సీక్వెల్ పై క్లారిటీ లేదు
అనిల్ రావిపూడి తనను కలిసినప్పుడల్లా సుడిగాడు సీక్వెల్ గురించి అడుగుతుంటాడని అల్లరి నరేష్ అన్నారు. అయితే మరి సుడిగాడు సీక్వెల్ ఖచ్చితంగా ఉంటుందా లేదా అనే విషయమై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. NBK 108సినిమాతో అనిల్ రావిపూడి బిజీగా ఉన్నాడు. ఈ సినిమా దసరా కానుకగా రిలీజ్ కానుంది. ఆ తర్వాత మరో పెద్ద హీరోతో సినిమా చేసే పనిలో అనిల్ రావిపూడి ఉన్నాడని సమాచారం. మరి అన్నీ కుదురుకుని అల్లరి నరేష్ తో సుడిగాడు సీక్వెల్ తీయాలంటే చాలా టైమ్ పడుతుంది. అదీగాక ఇప్పుడిప్పుడే సీరియస్ సినిమాలతో వస్తున్న అల్లరి నరేష్, మళ్లీ కామెడీ రూటులోకి వచ్చేలా లేడని అంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.