LOADING...
Varanasi: రాజమౌళి మార్క్ మేకింగ్‌కు ఫిదా అయిన అనిల్ రావిపూడి.. 'వారణాసి' గ్లింప్స్‌పై ప్రశంసలు
రాజమౌళి మార్క్ మేకింగ్‌కు ఫిదా అయిన అనిల్ రావిపూడి.. 'వారణాసి' గ్లింప్స్‌పై ప్రశంసలు

Varanasi: రాజమౌళి మార్క్ మేకింగ్‌కు ఫిదా అయిన అనిల్ రావిపూడి.. 'వారణాసి' గ్లింప్స్‌పై ప్రశంసలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 08, 2025
01:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి, సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న మోస్ట్‌ అవెయిటెడ్‌ ప్రాజెక్ట్‌ 'వారణాసి'పై అంచనాలు రోజు రోజుకు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా విడుదలైన టైటిల్‌ గ్లింప్స్‌ ఒక్కసారిగా సోషల్‌ మీడియాలో సునామీలా వైరల్‌ అవుతూ అభిమానుల్లో పూనకాలు తెప్పించాయి. ఊహించని విజువల్‌ ట్రీట్‌తో జక్కన్న మరొకసారి తన మార్క్‌ను చూపించాడు. ఈ గ్లింప్స్‌పై దర్శకుడు అనిల్‌ రావిపూడి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీజర్ చూసిన వెంటనే ఎగ్జైట్‌మెంట్‌తో మహేశ్‌ బాబుకు స్వయంగా ఫోన్‌ చేసి చాలాసేపు మాట్లాడానని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఎద్దుపై వచ్చిన మహేశ్‌ ఎంట్రీ చూసి షాక్‌ అయ్యాను.

Details

'మన శంకర వరప్రసాద్ గారు' షూటింగ్‌లో బిజీగా అనిల్ రావిపూడి

ప్రతి ఫ్రేమ్ టైమ్‌ ట్రావెలర్‌లా అనిపించింది. రాజమౌళి గారి విజన్‌, క్రియేటివిటీ ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలుసు. కానీ గ్లోబ్‌ ట్రాటర్‌ ఈవెంట్‌లో మహేశ్‌ బాబు ఎద్దుపై వచ్చే సీన్‌ నన్ను మాటలు రానివ్వలేదు. మరో అద్భుతం రాబోతుందనిపించిందని అనిల్‌ అన్నారు. ప్రస్తుతం తాను మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిస్తున్న 'మన శంకర వరప్రసాద్ గారు' షూటింగ్‌లో బిజీగా ఉన్నట్లు చెప్పారు. ఈ చిత్రంలో వెంకటేష్‌ కూడా 20 నిమిషాల పాటు ఉండే పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించబోతున్నారని వెల్లడించారు.

Details

వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్

చిరు-వెంకీ కాంబినేషన్‌లో వచ్చే క్లైమాక్స్ సీన్లు థియేటర్లలో ఆడియన్స్‌ను రెప్పపాటులో పూనకం తెప్పిస్తాయని చెప్పారు. 2026 సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నామని అనిల్‌ ధీమా వ్యక్తం చేశారు. మొత్తానికి, రాజమౌళి-మహేశ్‌ 'వారణాసి'పై తన ఉత్సాహాన్ని పంచుకుంటూనే, చిరు-వెంకీ మూవీపై అంచనాలు పెంచేసిన అనిల్‌ రావిపూడి కామెంట్స్‌ ఇప్పుడు వైరల్‌గా మారాయి.

Advertisement