యానిమల్ మొదటి పాట విడుదల: అర్జున్ రెడ్డిని గుర్తు చేస్తున్న అమ్మాయి పాట
రణ్ బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం యానిమల్. ఇదివరకు ఈ సినిమా నుండి ఇంట్రెస్టింగ్ టీజర్ రిలీజ్ అయ్యింది. తాజాగా మొదటి పాటను రిలీజ్ చేసారు. నింగీ నేలా.. నీలా నాలా అంటూ సాగే వీడియో సాంగ్ ఆకట్టుకునేలా ఉంది. 2నిమిషాల 45సెకన్ల నిడివి గల ఈ పాట పూర్తి వీడియోను విడుదల చేయడం నిజంగా సర్పైజ్ అనే చెప్పాలి. ఈ పాట వీడియో చూస్తున్నప్పుడు అర్జున్ రెడ్డి గుర్తుకు రావడం చాలా సహజం. ఎందుకంటే, అర్జున్ రెడ్డి సినిమాలో మాదిరిగానే ఈ పాటలోనూ లిప్ లాక్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించిన ఈ పాటను రాఘవ్ చైతన్య, ప్రీతమ్ పాడారు.