
ఆగస్టు రేస్ నుంచి తప్పుకున్న 'యానిమల్' సినిమా రిలీజ్.. ఏకంగా 15 వారాలు వాయిదా
ఈ వార్తాకథనం ఏంటి
యానిమల్ ప్రీ టీజర్ ఇటీవలే 3 వారాల కిందట విడుదలై యూట్యూబ్‌లో భారీ రికార్డులు సృష్టించింది.
రిలీజ్ చేసిన నిమిషాల్లోనే మిలయన్ల కొద్దీ వ్యూస్ సాధించింది. ప్రీ-టీజర్‌కు వచ్చిన అపూర్వ స్పందనకు చిత్ర నిర్మాణ బృందం సైతం అవాక్కైంది.
అందరూ కబీర్ సింగ్‌ను వైలెంట్ ఫిలింగా చెబుతున్నారని,కానీ అసలైన వైలెన్స్ సినిమాను నెక్ట్స్ సినిమాలో చూపిస్తానని చెప్పిన సందీప్ రెడ్డి వంగా ఆ మాటల్ని నిజం చేశాడు.
రణ్ బీర్ కపూర్, రష్మిక నటించిన మూవీ భారతదేశంలోనే ది మోస్ట్ వైలెంట్ సినిమాగా రూపొందుతోంది.
ఆగస్టు11న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు తొలుత ప్రకటించిన మూవీ టీమ్, తాజాగా సినిమా రిలీజ్ ను ఏకంగా ఏకంగా 15 వారాలు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.
DETAILS
షూటింగ్ పూర్తైనా ప్యాచ్ వర్క్ ఇంకా కాలేదు
ఈ మేరకు డిసెంబర్ 1న సినిమాను రిలీజ్ చేయనున్నట్లు డైరెక్టర్ సందీప్ వంగా తెలిపారు. షూటింగ్ పూర్తైనా ప్యాచ్ వర్క్ ఇంకా కాలేదన్నారు.
మరో 2 నెలల్లో ఆయా పనులు పూర్తి చేసి, ప్రమోషన్‌లు నిర్వహించడం సాధ్యమయ్యే పని కాదని చిత్ర బృందం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే సినిమాను వాయిదా వేశారని సమాచారం.
ఆగస్ట్ 11న టాలీవుడ్‌లో చిరంజీవి భోళా శంకర్, కోలీవుడ్‌లో రజనీ కాంత్ జైలర్ చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. యానిమల్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ ఈ సీనియర్ స్టార్ హీరోల చిత్రాల ధాటిని తట్టుకోవడం కష్టమే.
మరో వైపు హిందీలోనూ గదర్-2తో పెద్ద పోటీ నెలకొని ఉంది. ఈ క్రమంలోనే సినిమాను వాయిదా వేసినట్లు ప్రచారం జరుగుతోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
యానిమల్ కొత్త విడుదల తేదీని ప్రకటిస్తున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా
Animal New Release date || Dec 1st 2023@AnilKapoor #RK @iamRashmika @thedeol @tripti_dimri23 @imvangasandeep #BhushanKumar @VangaPranay @MuradKhetani #KrishanKumar @anilandbhanu @VangaPictures @Cine1Studios @TSeries @rameemusic @cowvala #SundarSomasundaram @sureshsrajan pic.twitter.com/XBBowgjGSK
— Bhadrakali Pictures (@VangaPictures) July 3, 2023