LOADING...
Animal Movie Review : యానిమల్ మూవీ రివ్యూ.. రణబీర్- సందీప్ వంగా బ్లాక్ బాస్టర్ కొట్టారా..?
యానిమల్ మూవీ రివ్యూ.. రణబీర్- సందీప్ వంగా బ్లాక్ బాస్టర్ కొట్టారా..?

Animal Movie Review : యానిమల్ మూవీ రివ్యూ.. రణబీర్- సందీప్ వంగా బ్లాక్ బాస్టర్ కొట్టారా..?

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 01, 2023
02:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కలయికలో రూపొందిన పాన్ ఇండియా చిత్ర 'యానిమల్' (Animal). టీజర్, ట్రైలర్‌తో ఈ సినిమా అంచనాల్ని, ఆసక్తిని రేకెత్తించింది. మరి ఈ మూవీ రివ్యూ ఎలా ఉందో తెలుసుకుందాం. బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) దేశంలోనే అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్త. తనయుడు రణ్ విజయ్ (రణ్ బీర్ సింగ్) ఎవరినైనా సరే ధైర్యంగా ఎదిరించే రకం. వ్యాపారులతో బిజీగా ఉండే బల్బీర్ సింగ్ కొడుకును పట్టించుకోడు. విజయ్ చేసే పనులు తండ్రి బల్బీర్ సింగ్ కి నచ్చవు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు మొదలవుతాయి. దీంతో తాను ప్రేమించిన గీతాంజలి( రష్మిక)ని పెళ్లి చేసుకొని విజయ్ అమెరికాకు వెళ్లిపోతాడు.

Details

రణబీర్ నటన అద్భుతం 

ఆ తర్వాత తండ్రిపై హత్యయత్నం జరుగుతుంది. ఇక తండ్రిని హత్య చేయాలనుకున్న శత్రువును విజయ్ ఎలా చంపుతాడన్నది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. తండ్రిపై అంతులేని ప్రేమ ఉన్న ఓ కొడుకు పూర్తి జీవితాన్ని తెర‌పైన ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నమే ఈ సినిమాలో కన్పిస్తుంది. ఇంటర్వెల్ ముందు వ‌చ్చే స‌న్నివేశాలు ఈసినిమాని మరోస్థాయికి తీసుకెళ్లాయి. మితిమీరిన ర‌క్త‌పాతం, అస‌భ్యక‌ర‌మైన కొన్ని హావ‌భావాలు, విన‌లేని సంభాష‌ణ‌లు కొంచెం ప్రేక్షకులను ఇబ్బంది పెడతాయి. ఇక రణబీర్ కపూర్ నటన ఈ సినిమా హైలైట్. గీతాంజలి పాత్రకు రష్మిక న్యాయం చేసింది. బాబీ డియోల్‌ విలనిజం బాగా పండించాడు. సెకండాఫ్‌లో కొన్ని సీన్స్‌ నిడివిని కాస్త తగ్గిస్తే బాగుండేది. ఓవరాల్‌గా యాక్షన్ లవర్స్ కు ఈ సినిమా నచ్చుతుంది.