Page Loader
Animal park-Sandeep Vanga: యానిమల్ పార్క్ ప్రాజెక్టుపై క్రేజీ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ సందీప్ వంగా
యానిమల్​ సినిమా దర్శకుడు సందీప్​ రెడ్డి వంగా

Animal park-Sandeep Vanga: యానిమల్ పార్క్ ప్రాజెక్టుపై క్రేజీ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ సందీప్ వంగా

వ్రాసిన వారు Stalin
Apr 24, 2024
05:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

యానిమల్(Animal)సినిమాతో దర్శకుడు సందీప్ రెడ్డి(Sandeep Vanga)వంగ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. రణ్ బీర్ కపూర్(Ranbeer Kapur)హీరోగా నటించిన యానిమల్ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ చిత్రానికి సీక్వెల్ ఉందంటూ యానిమల్ మూవీ క్లైమాక్స్ లో సందీప్ వంగా వదిలిన కర్టెన్ రైజర్ ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను పెంచేసింది. ఇప్పుడు ఈ యానిమల్ పార్క్(Animal Park)సినిమాకు సంబంధించి సందీప్ వంగా కీలకమైన అప్డేట్ ఇచ్చాడు. యానిమల్ మూవీ సీక్వెల్ అయిన యానిమల్ పార్క్ 2025 సంవత్సరంలో షూటింగ్ మొదలవుతుందని తెలిపాడు. ఇక యానిమల్ పార్క్ సినిమా యానిమల్ కంటే మరింత వైల్డ్ గా ఉంటుందని ముందే హింట్ ఇచ్చేశాడు.