తదుపరి వార్తా కథనం

Devara Teaser : దేవర టీజర్‌పై కీలక అప్డేట్.. పులికి సలాం కొట్టాల్సిందేనన్న అనిరుధ్!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Dec 27, 2023
05:38 pm
ఈ వార్తాకథనం ఏంటి
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తోన్న 'దేవర' సినిమాపై అంచనాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి.
ఈ సినిమా కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ చాలా కష్టపడుతున్నాడు. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటివరకూ ఒక పోస్టర్ మాత్రమే రిలీజ్ అయ్యింది.
ఇప్పటివరకూ గ్లింప్స్ రిలీజ్ చేయకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు.
తాజాగా దేవర మ్యూజిక్ డైరక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ టీజర్ పై కీలక అప్డేట్ ఇచ్చారు.
దేవర టీజర్ కోసం ఎగ్జైటెడ్‌గా ఎదురు చూస్తున్నారని, అందరూ పులిని అభినందించాల్సిందే అని ట్వీట్ చేశారు.
దీంతో దేవర్ టీజర్ రెడీ అయిందని అభిమానులు భావిస్తున్నారు.
ఇక ఈ టీజర్ కి అనిరుధ్ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
దేవర టీజర్ గురించి ట్వీట్ చేసిన అనిరుధ్
#Devara teaser 👏👏👏@tarak9999 and #KoratalaSiva 🔥🔥🔥
— Anirudh Ravichander (@anirudhofficial) December 26, 2023
Excited 🎶🥁🙌#AllHailTheTiger