Loading...
Anna Konidala : పవన్ కళ్యాణ్ బర్త్‌డే.. స్పెషల్ ఫొటో షేర్ చేసి విషెస్ చెప్పిన భార్య అన్నా కొణిదెల
పవన్ కళ్యాణ్ బర్త్‌డే.. స్పెషల్ ఫొటో షేర్ చేసి విషెస్ చెప్పిన భార్య అన్నా కొణిదెల

Anna Konidala : పవన్ కళ్యాణ్ బర్త్‌డే.. స్పెషల్ ఫొటో షేర్ చేసి విషెస్ చెప్పిన భార్య అన్నా కొణిదెల

వ్రాసిన వారు Moogati Shabari
Sep 02, 2026
10:26 am

ఈ వార్తాకథనం ఏంటి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, నెటిజన్లు, సినీ ప్రముఖులు, జనసైనికులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ భార్య అన్నా కొణిదెల కూడా ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. పవన్‌తో కలిసి దిగిన ఓ క్యూట్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

వివరాలు

ఫోటో షేర్ చేసిన అన్నా కొణిదెల..

ఈ సందర్భంగా అన్నా కొణిదెల చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. ''ఈ రోజు మిమ్మల్ని సెలబ్రేట్ చేస్తున్నాను.

మీరు ఎన్నో హృదయాల్లో, ఆలోచనల్లో, ప్రార్థనల్లో ఉన్నారు. మీరు ఎంతోమంది జీవితాలపై ప్రభావం చూపించారనడానికి, ఇతరులకు ఎంతగా ఇచ్చారనడానికి ఇది ఒక అందమైన నిదర్శనం.

పుట్టినరోజు శుభాకాంక్షలు'' అంటూ ఆమె పవన్ కళ్యాణ్‌కు బర్త్‌డే విషెస్ తెలిపారు.

పవన్ కళ్యాణ్‌తో కలిసి దిగిన ఫొటోను అన్నా కొణిదెల షేర్ చేయడంతో అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.

ఆమె చేసిన పోస్ట్‌తో పాటు ఆ ఫొటో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ADVERTISEMENT