Page Loader
Puri Jagannadh: 'భిక్షాందేహి'లో మరో నటి చేరిక.. సోషల్ మీడియాలో ఫోటో షేర్ చేసిన మూవీ టీమ్!
'భిక్షాందేహి'లో మరో నటి చేరిక.. సోషల్ మీడియాలో ఫోటో షేర్ చేసిన మూవీ టీమ్!

Puri Jagannadh: 'భిక్షాందేహి'లో మరో నటి చేరిక.. సోషల్ మీడియాలో ఫోటో షేర్ చేసిన మూవీ టీమ్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 17, 2025
01:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

విజయ్‌ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రానికి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ బయటకొచ్చింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో నటి సంయుక్త కీలక పాత్రలో భాగమైనట్లు చిత్రబృందం ప్రకటించింది. సోషల్ మీడియా వేదికగా ఆమెతో దిగిన ఓ ఫోటోను షేర్‌ చేస్తూ.. "ఆమె నడకలో హుందాతనం.. కళ్లల్లో ఆగ్రహం ఉంది" అంటూ క్యాప్షన్‌ జతచేశారు. ఆమె పాత్ర చిత్రకథలో కీలకంగా ఉండనుందని వెల్లడించారు. ఇంతకుముందే ఈసినిమాలో సీనియర్ నటి టబు నటిస్తున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం మేరకు ఈ సినిమాకు 'భిక్షాందేహి' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ముందు ఈ సినిమాకు 'బెగ్గర్‌' అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు వార్తలొచ్చాయి.

Details

మూవీపై పెరిగిన అంచనాలు

పూరి జగన్నాథ్ గత కొన్ని సినిమాలు 'లైగర్', 'డబుల్ ఇస్మార్ట్' బాక్సాఫీస్ వద్ద విఫలమైన నేపథ్యంలో, ఈసారి విజయ్ సేతుపతితో హిట్ కొట్టే ప్రయత్నంలో ఉన్నారు. సినిమా పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇక సంయుక్త విషయానికొస్తే.. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. ఆమె బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందనున్న 'అఖండ 2'లో కూడా కీలక పాత్ర పోషించబోతున్నారు. ఇటీవలే చిత్రబృందం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఇందులోనూ ఆమెకు నటనకు ఆస్కారమున్న గట్టిపాత్ర దక్కినట్లు సమాచారం. ఈ మేరకు పూరి జగన్నాథ్ - విజయ్ సేతుపతి కాంబోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు సంయుక్త, టబుల చేరికతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.