LOADING...
Sai Pallavi: 'అమరన్'తో మరో అవార్డు.. సాయి పల్లవి ఖాతాలో 7 ఫిలింఫేర్లు
'అమరన్'తో మరో అవార్డు.. సాయి పల్లవి ఖాతాలో 7 ఫిలింఫేర్లు

Sai Pallavi: 'అమరన్'తో మరో అవార్డు.. సాయి పల్లవి ఖాతాలో 7 ఫిలింఫేర్లు

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 22, 2026
02:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

దక్షిణాది చిత్రసీమలో గ్లామర్ కంటే నటనకు ప్రాధాన్యం ఇచ్చే అరుదైన హీరోయిన్లలో సాయి పల్లవి ముందుంటారు. మేకప్‌కు దూరంగా సహజ సౌందర్యంతోనే వెండితెరపై మెరిసే ఈ నటి తాజాగా మరో విశిష్ట మైలురాయిని చేరుకున్నారు. ఇటీవల జరిగిన ఫీలిం ఫైర్ వేడుకలో అమరన్ చిత్రానికి గాను ఉత్తమ నటి అవార్డును అందుకోవడంతో ఆమె ఖాతాలో మొత్తం 7 ఫిలింఫేర్ అవార్డులు చేరాయి. ప్రేమమ్‌తో ప్రారంభమైన ఆమె సినీ ప్రయాణం, నేడు భారతీయ సినీ పరిశ్రమలోనే అత్యుత్తమ నటిగా (GOAT Actress) కీర్తించబడే స్థాయికి ఎదిగింది. ఇప్పటివరకు ఆమె అందుకున్న ఫిలింఫేర్ అవార్డుల జాబితా విశేషమే:

Details

ఏడు అవార్డులు ఇవే

1. ప్రేమమ్ - బెస్ట్ యాక్ట్రెస్ డెబ్యూ (మలయాళం) 2. ఫిదా - ఉత్తమ నటి (తెలుగు) 3. శ్యామ్ సింగరాయ్ - ఉత్తమ నటి (తెలుగు) 4. లవ్ స్టోరీ - ఉత్తమ నటి (తెలుగు) 5. గార్గి - ఉత్తమ నటి (తమిళం) 6. విరాటపర్వం - ఉత్తమ నటి - క్రిటిక్స్ (తెలుగు) 7. అమరన్ - ఉత్తమ నటి (తమిళం - తాజా)

Details

రెబెకా వర్గీస్ పాత్రలో అద్భుత నటన

వేర్వేరు భాషల్లో, విభిన్నమైన పాత్రలతో ఒకే నటి ఇన్ని అవార్డులు అందుకోవడం విశేషమే కాక రికార్డు స్థాయి సాధనగా చెప్పాలి. ముఖ్యంగా గతేడాది విడుదలైన 'అమరన్' చిత్రంలో ఇందు రెబెకా వర్గీస్ పాత్రలో ఆమె ప్రదర్శించిన భావోద్వేగాలకు ఫిలింఫేర్ జ్యూరీ మంత్రముగ్ధమైందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఆమె చేతిలో హిందీలో రూపొందుతున్న రామాయణ వంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇదే జోరును కొనసాగిస్తే, భవిష్యత్తులో మరిన్ని రికార్డులను సాయి పల్లవి తిరగరాయడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Advertisement