LOADING...
Katrina Kaif : తల్లిదండ్రులు కాబోతున్న మరో బాలీవుడ్ జంట..!
తల్లిదండ్రులు కాబోతున్న మరో బాలీవుడ్ జంట..!

Katrina Kaif : తల్లిదండ్రులు కాబోతున్న మరో బాలీవుడ్ జంట..!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 03, 2025
10:08 am

ఈ వార్తాకథనం ఏంటి

ఒకప్పుడు సినిమాల్లో నటించే హీరోలు, హీరోయిన్లు తమ కెరీర్‌కే ప్రాధాన్యత ఇచ్చే రోజులు. ముఖ్యంగా నటీమణులు పెళ్లి చేసుకుంటే అవకాశాలు తగ్గిపోతాయనే భావనతో వ్యక్తిగత జీవితం నుంచి తక్కువ దూరంగానే ఉండేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఫిల్మ్ ఇండస్ట్రీలోని తారలు ఇప్పుడు వ్యక్తిగత జీవితానికే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. నేటి హీరోయిన్‌లు కూడా కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పటికీ మ్యారేజ్ లైఫ్‌లోకి అడుగుపెడుతున్నారు. అంతే కాదు పెళ్లయిన కొద్ది నెలలకే గుడ్ న్యూస్‌తో అభిమానులకు సంతోషం పంచుతున్నారు.ఈ క్రమంలో ఇప్పటికే కియారా అద్వానీ - సిద్ధార్థ్ మల్హోత్రా దంపతులకు పాప పుట్టిన సంగతి తెలిసిందే. మరోవైపు వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారని ప్రకటించారు.

Details

ఇప్పటివరకూ ఒక్క సినిమాలో కూడా నటించలేదు

ఇక తాజాగా బాలీవుడ్ స్టార్ జంట విక్కీ కౌశల్ - కత్రినా కైఫ్ త్వరలో పేరెంట్స్ కాబోతున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ ఇప్పటి వరకు ఒక్క సినిమాలో కూడా కలిసి నటించలేదు. అయినప్పటికీ ప్రేమలో పడ్డారు. అయితే ఈ విషయం చాలా కాలం పాటు బయటకు రాలేదు. కరణ్ జోహార్ షోలో కత్రినా చేసిన ఓ వ్యాఖ్య తరువాతే వారి రిలేషన్ పట్టు మీదికి వచ్చింది. అనంతరం ఓ అవార్డ్ ఫంక్షన్‌లో విక్కీ కత్రినాను ప్రపోజ్ చేయడంతో వీరి ప్రేమ బంధం బహిరంగమైంది. 2021 డిసెంబర్‌లో రాజస్థాన్‌లో జరిగిన డ్రీమ్ వెడ్డింగ్‌లో వీరిద్దరూ వివాహబంధంతో ఒక్కటయ్యారు.

Details

అధికారిక ప్రకటన ఇవ్వని జంట

అప్పటి నుంచి వీరిద్దరూ ఎప్పుడెప్పుడు శుభవార్త చెబుతారోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా విక్కీ - కత్రినా జంట ముంబయి నుంచి అలీబాగ్‌కి ప్రయాణిస్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో కత్రినా ధరించిన తెల్లటి ఓవర్‌సైజ్డ్ చొక్కా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి చొక్కాలను సాధారణంగా గర్భవతులు మాత్రమే ధరిస్తారు... మరి కత్రినా ఎందుకు వేసుకుంది? అంటూ నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్తలపై ఇప్పటివరకు విక్కీ కౌశల్ కానీ, కత్రినా కైఫ్ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.