LOADING...
AvatarFireAndAsh Review : పండోరా ప్రపంచానికి మరో అధ్యాయం.. మిక్స్‌డ్‌ టాక్‌ దక్కించుకున్న 'ఫైర్ అండ్ యాష్'
పండోరా ప్రపంచానికి మరో అధ్యాయం.. మిక్స్‌డ్‌ టాక్‌ దక్కించుకున్న 'ఫైర్ అండ్ యాష్'

AvatarFireAndAsh Review : పండోరా ప్రపంచానికి మరో అధ్యాయం.. మిక్స్‌డ్‌ టాక్‌ దక్కించుకున్న 'ఫైర్ అండ్ యాష్'

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 19, 2025
09:54 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్‌ కామెరూన్ రూపొందించిన ప్రతిష్టాత్మక చిత్రం 'అవతార్: ఫైర్ అండ్ యాష్' ప్రపంచవ్యాప్తంగా గతరాత్రి ప్రీమియర్స్‌తో థియేటర్లలోకి వచ్చింది. అవతార్‌ సిరీస్‌పై మొదటి నుంచే ఆడియెన్స్‌లో భారీ అంచనాలు ఉండగా, తాజా భాగంపై కూడా అదే స్థాయి క్రేజ్‌ కనిపించింది. ఇటు భారత్‌లోనూ ఈ సినిమాకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. అడ్వాన్స్‌ బుకింగ్స్‌, ఆన్‌లైన్‌ ట్రెండ్స్‌లో అవతార్‌ దూకుడు స్పష్టంగా కనిపించగా, ఎప్పుడెప్పుడు పెద్ద తెరపై ఈ విజువల్‌ వండర్‌ను చూద్దామా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన 'అవతార్: ఫైర్ అండ్ యాష్' ప్రేక్షకుల నుంచి మిక్స్‌డ్‌ రివ్యూలను అందుకుంటోంది.

Details

అవతార్ స్థాయికి మాత్రం చేరలేదు

ఇప్పటివరకు వచ్చిన అవతార్‌ పార్ట్‌ 2 'వే ఆఫ్ వాటర్'కు, తాజా భాగమైన 'ఫైర్ అండ్ యాష్'కు కథ, కథనాల్లో పెద్దగా తేడా లేదని సోషల్‌ మీడియాలో పలువురు అభిప్రాయపడుతున్నారు. మరో వర్గం ప్రేక్షకులు మాత్రం అవతార్‌ 2 కంటే అవతార్‌ 3 కాస్త మెరుగ్గా ఉందని, అయినప్పటికీ అవతార్‌ 1 స్థాయికి మాత్రం చేరలేదని కామెంట్స్‌ చేస్తున్నారు. మొత్తంగా చూస్తే 'అవతార్: ఫైర్ అండ్ యాష్'లో పండోరా ప్రపంచం కథనం పార్ట్‌ 2ని తలపిస్తుందని, అది దాని పొడిగించిన వెర్షన్‌లా అనిపిస్తోందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్ట్‌ 3లో కొత్త మాంగ్‌క్వాన్‌ తెగ పరిచయం కావడం తప్ప, కథాపరంగా 'వావ్' అనిపించే స్థాయి అంశాలు పెద్దగా లేవని కొందరు విమర్శిస్తున్నారు.

Details

సినిమా నిడివి ఎక్కువగా ఉండడంపై భిన్నాభిప్రాయాలు

సినిమాకి నిడివి కూడా కాస్త ఎక్కువగా ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే జేమ్స్‌ కామెరూన్‌ మేకింగ్‌ స్టైల్‌, సౌండ్‌ డిజైన్‌, సీజీఐ, విజువల్స్‌ మాత్రం మరో స్థాయిలో ఉన్నాయనే విషయాన్ని చాలా మంది ఏకగ్రీవంగా అంగీకరిస్తున్నారు. సిల్వర్‌ స్క్రీన్‌పై అద్భుతమైన సినిమాటిక్‌ అనుభూతిని అందించే చిత్రంగా 'అవతార్: ఫైర్ అండ్ యాష్' నిలుస్తోంది. కథ పరంగా లోటుపాట్లు ఉన్నా, విజువల్‌ వండర్‌ను ఆస్వాదించాలనుకునే ప్రేక్షకులు తప్పకుండా థియేటర్‌లో చూడదగ్గ సినిమా అని చెప్పాలి.

Advertisement