Raaka: అల్లు అర్జున్ 'రాకా'లో మరో హీరోయిన్.. లేడీ విలన్‌గా మలయాళ బ్యూటీ!
ఈ వార్తాకథనం ఏంటి
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక పాన్ ఇండియా చిత్రం 'రాకా'పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించి చిన్న అప్డేట్ బయటకు వచ్చినా సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. దీంతో రోజురోజుకీ ఈ మూవీపై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే 'రాకా'లో దీపికా పదుకొణె, మృణాల్ ఠాకూర్, రకుల్ ప్రీత్ సింగ్, జాన్వీ కపూర్ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి మరో హీరోయిన్ పేరు చేరింది. మలయాళ నటి ఐశ్వర్య లక్ష్మి కూడా ఈ సినిమాలో భాగం కానున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.
వివరాలు
సంగీతాన్ని అందిస్తున్న సాయి అభ్యంకర్
అంతేకాదు.. ఐశ్వర్య లక్ష్మి 'రాకా'లో కీలకమైన లేడీ విలన్ పాత్రలో కనిపించనున్నారనే టాక్ వినిపిస్తోంది.
అయితే ఈ విషయంపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ ఈ ప్రచారం నిజమైతే సినిమాలో మొత్తం ఐదుగురు ఫిమేల్ ఆర్టిస్టులు కీలక పాత్రల్లో కనిపించే అవకాశం ఉంది.
ఇంతమంది స్టార్ హీరోయిన్ల పాత్రలను దర్శకుడు అట్లీ కథలో ఎలా డిజైన్ చేశారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
అల్లు అర్జున్ కెరీర్‌లో 22వ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.
సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. సంస్కృతంలో 'రాకా' అనే పదానికి 'పౌర్ణమి' అనే అర్థం ఉన్నట్లు సమాచారం.
వివరాలు
ఇప్పటివరకూ అధికారిక ప్రకటన వెలువడలేదు
ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్ అత్యంత పవర్‌ఫుల్‌గా ఉంటుందని, మాఫియా నేపథ్యంలో కథ సాగుతుందనే ప్రచారం కూడా జరుగుతోంది.
ప్రస్తుతం 'రాకా' షూటింగ్ ముంబై పరిసర ప్రాంతాల్లో శరవేగంగా కొనసాగుతోంది. ఇటీవల నటి మంచు లక్ష్మి కూడా ఈ సినిమా సెట్స్‌ను సందర్శించిన విషయం తెలిసిందే.
అక్కడ భారీగా ఏర్పాటు చేసిన వింత జంతువుల సెట్టింగ్స్‌ను చూసి తాను ఆశ్చర్యపోయినట్లు ఆమె సోషల్ మీడియాలో వెల్లడించారు.
దీంతో 'రాకా'పై అంచనాలు మరింత పెరిగాయి. అయితే ఐశ్వర్య లక్ష్మి ఎంట్రీ, ఆమె పాత్రకు సంబంధించిన ప్రచారంలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలంటే చిత్రబృందం అధికారికంగా స్పందించాల్సిందే.
అప్పటివరకు 'రాకా'లో అట్లీ అసలు ప్లాన్ ఏంటన్నది సస్పెన్స్‌గానే ఉండనుంది.