Devara: దేవర నుంచి ఎన్టీఆర్ కొత్త లుక్ త్వరలో విడుదల
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ గ్లామరస్ నటి జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న చిత్రం దేవర. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 10, 2024న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం గోవాలో ఒక మాంటేజ్ పాటను చిత్రీకరిస్తున్నారు. ఇది సినిమాలో కీలకమైన పాయింట్‌లో వచ్చే సాంగ్. ఇక ఈ సినిమా వాయిదా పడినప్పటికీ మేకర్స్ ఏదొక అప్డేట్ ఇస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నాడనే సంగతి తెలిసిందే.
ఎన్టీఆర్ ఏజ్డ్ లుక్‌ని విడుదలకు మేకర్స్ సన్నాహాలు
అయితే ఇప్పుడు ఈ రెండు పాత్రలలో కాకుండా మరో షేడ్ లో కూడా తారక్ దర్శనమివ్వనున్నాడన్న టాక్ వినిపిస్తోంది. రాబోయే రోజుల్లో అతని ఈ ఏజ్డ్ లుక్‌ని విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. బిజినెస్ కారణాలతో సినిమా వార్తల్లో నిలవాలని, అందుకే బ్యాక్ టు బ్యాక్ స్టిల్స్ రిలీజ్ చేస్తున్నారట. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విల్లన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు,అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.