LOADING...
Kubera : 'కుబేర' నుంచి మరో మ్యూజికల్ ట్రీట్.. సెకండ్ సింగిల్‌కు డేట్ ఫిక్స్!
'కుబేర' నుంచి మరో మ్యూజికల్ ట్రీట్.. సెకండ్ సింగిల్‌కు డేట్ ఫిక్స్!

Kubera : 'కుబేర' నుంచి మరో మ్యూజికల్ ట్రీట్.. సెకండ్ సింగిల్‌కు డేట్ ఫిక్స్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 01, 2025
08:15 am

ఈ వార్తాకథనం ఏంటి

'లవ్ స్టోరీ' తర్వాత దాదాపు నాలుగేళ్ల విరామం తీసుకున్న శేఖర్ కమ్ముల, ఇప్పుడు 'కుబేర' అనే కొత్త చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు తమిళ స్టార్ ధనుష్ హీరోగా నటించగా, రష్మిక మందన్న కథానాయికగా కనిపించనుంది. ఇందులో అక్కినేని నాగార్జున ఒక కీలక పాత్రలో మెరవబోతున్నారు. ఈ చిత్రాన్ని జూన్ 20న థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. విడుదల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషనల్ అప్‌డేట్స్‌ను వరుసగా వదులుతున్నారు. ఇప్పటికే విడుదలైన 'కుబేర' టీజర్‌కు మంచి స్పందన లభించింది.

Details

జూన్ 2న మరో సాంగ్ రిలీజ్

ఇందులో ధనుష్ లుక్ ఆకట్టుకోగా, నాగార్జున యాక్టింగ్ కూడా భిన్నంగా అనిపించింది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఈ మిస్టరీను మరింతగా పెంచింది. కానీ ఇది శేఖర్ కమ్ముల మునుపటి సినిమాల లాగా అనిపించకుండా, ఆయన కొత్త దారి ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఇక తొలి పాటకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో, మేకర్స్ మరో మ్యూజికల్ ట్రీట్‌కు సిద్ధమయ్యారు. తాజా సమాచారం ప్రకారం 'కుబేర' మూవీకి సంబంధించిన రెండో సింగిల్‌ను జూన్ 2న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.