
The Paradise : నానిలో మరో కొత్త కోణం.. 'ది ప్యారడైజ్'లో నెగటివ్ షేడ్ హింట్!
ఈ వార్తాకథనం ఏంటి
నాని కెరీర్‌లోనే అతిపెద్ద విజయాన్ని అందించిన చిత్రం 'దసరా'. ఈ బ్లాక్‌బస్టర్ హిట్‌తో ఆయన మాస్ ఆడియెన్స్‌కి మరింత చేరువయ్యాడు. ఆ సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్‌లో 'మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్'గా గుర్తింపు పొందిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, ఇప్పుడు తన రెండో ప్రాజెక్ట్‌కూ నానినే హీరోగా ఎంచుకున్నారు. ఈ కాంబినేషన్‌లో వస్తున్న నూతన చిత్రం 'ది ప్యారడైజ్'. యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ ఇప్పటికే విడుదలై, భారీ అంచనాలు సృష్టించాయి. తాజాగా లభించిన సమాచారం ప్రకారం, నాని ఈ సినిమాలో మూడు విభిన్న కోణాల్లో కనిపించనున్నాడని తెలుస్తోంది.
Details
సరికొత్త్ అవతారంలో నాని
అందులో ఒకటి నెగటివ్ షేడ్ కూడా ఉండనుందట. ఇప్పటివరకు రియలిస్టిక్ రోల్స్, మాస్ లుక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న నాని, ఈసారి గ్రే షేడ్స్‌తో ఎలా ఇంప్రెస్ చేస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. మాస్ ఆడియెన్స్‌ను దృష్టిలో పెట్టుకొని పక్కా యాక్షన్ ఎలిమెంట్స్‌తో రూపొందుతున్న ఈ సినిమా, ఫుల్ మాస్ ట్రీట్‌గా నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి. నాని లుక్ ద్వారా ఆ విషయం స్పష్టమవుతోంది. ప్రస్తుతం నానితో పాటు ఇతర కీలక నటీనటులు కూడా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌ను సుధాకర్ చెరుకూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా, మ్యూజిక్ డిపార్ట్‌మెంట్ బాధ్యతలను అనిరుధ్ రవిచందర్ తీసుకున్నారు.