Loading...
Rashmika - MS Subbulakshmi: రష్మిక కెరీర్‌లో మరో ప్రతిష్ఠాత్మక చిత్రం.. సుబ్బులక్ష్మిగా కనిపించనున్న నేషనల్‌ క్రష్‌!
రష్మిక కెరీర్‌లో మరో ప్రతిష్ఠాత్మక చిత్రం.. సుబ్బులక్ష్మిగా కనిపించనున్న నేషనల్‌ క్రష్‌!

Rashmika - MS Subbulakshmi: రష్మిక కెరీర్‌లో మరో ప్రతిష్ఠాత్మక చిత్రం.. సుబ్బులక్ష్మిగా కనిపించనున్న నేషనల్‌ క్రష్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 15, 2026
10:58 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి (MS Subbulakshmi) జీవిత కథను వెండితెరపై ఆవిష్కరించేందుకు కొంతకాలంగా ప్రయత్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌పై మేకర్స్‌ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇందులో ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి పాత్రను నటి రష్మిక మందన్న (Rashmika) పోషించనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. 'ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి అమ్మ' (MS Subbulakshmi Amma) పేరుతో ఈ బయోపిక్‌ తెరకెక్కనుంది. ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి 116వ జయంతిని పురస్కరించుకొని సెప్టెంబర్‌ 16న ఈ బయోపిక్‌ను అధికారికంగా ప్రారంభించనున్నట్లు నిర్మాతలు తెలిపారు.

వివరాలు

ముఖ్య అతిథిగా కమల్ హాసన్

ఇందుకోసం చెన్నైలో గ్రాండ్‌ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి అగ్రకథానాయకుడు కమల్‌ హాసన్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

ఈ ప్రతిష్ఠాత్మక చిత్రానికి గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహించనున్నారు. అనిరుధ్‌ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు. ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి పాత్ర కోసం మొదట సాయిపల్లవి, రుక్మిణీ వసంత్‌, కీర్తిసురేశ్‌ పేర్లు తెరపైకి వచ్చాయి.

అయితే చివరకు రష్మికను ఈ పాత్రకు ఎంపిక చేశారు. ఇప్పటికే ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి పాత్ర కోసం రష్మిక లుక్‌ టెస్ట్‌ కూడా చేయించుకున్నారు. దీంతో ఈ బయోపిక్‌లో ఆమె పాత్ర ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది.

ADVERTISEMENT