తదుపరి వార్తా కథనం
    
    
                                                                                Prasanth Narayanan: సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ మలయాళ దర్శకుడు కన్నుమూత
                వ్రాసిన వారు
                Jayachandra Akuri
            
            
                            
                                    Dec 28, 2023 
                    
                     04:00 pm
                            
                    ఈ వార్తాకథనం ఏంటి
సినీ పరిశ్రమలో ఇవాళ తమిళ నటుడు, డీఎండీకే అధినేత విజయ్ కాంత్ మరణం అందరిని కలిచి వేసింది. అయితే ఇదే రోజు మరో చేదు వార్త వినాల్సి వచ్చింది. ప్రముఖ మలయాళ థియేటర్ ఆర్టిస్ట్, దర్శకుడు ప్రశాంత్ నారాయణన్(51) మృతి చెందారు. ఇవాళ అనారోగ్యంతో తిరువనంతపురంలో ఆయన తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు తెలిసింది.
Details
ప్రశాంత్ నారాయణన్ మృతిపై ప్రముఖుల సంతాపం
రంగస్థలంలో ఎన్నో ప్రసిద్ధి నాటకాల రచనకు ప్రశాంత్ నారాయణన్ ప్రాణం పోశారు. మలయాళ సూపర్ స్టార్‌తో చాయాముఖి నాటకాన్ని కూడా ఆయన చేశారు. తన నటకాలతో ఎన్నో ప్రశంసలను ఆయన అందుకున్నాడు. అదే విధంగా ఆయన సేవలకు గుర్తింపుగా 'ది సంగీత నాటకం అకాడమీ అవార్డు'ను అందుకున్నారు. ప్రశాంత్ నారాయణన్ మృతితో మలయాళ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ఆయన మరణంపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.