NKR : కొత్త డైరెక్టర్'తో .. కళ్యాణ్ రామ్ తో సినిమా ఫిక్స్
ఈ వార్తాకథనం ఏంటి
నందమూరి కళ్యాణ్ రామ్ 2022లో వచ్చిన బింబిసారా సినిమాతో అద్భుతమైన విజయం సాధించి తన కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. అయితే,ఆతర్వాత వచ్చిన అమిగోస్,డెవిల్ సినిమాలతో ప్లాప్ లు అందుకున్నాడు. ఈఏడాది విడుదలైన అర్జున్ సన్నాఫ్ వైజయంతి భారీ అంచనాల మధ్య విడుదలై మిక్స్డ్ రియాక్షన్ ను తెచ్చింది. ఈ నేపథ్యంలో,కళ్యాణ్ రామ్ కొద్దిగా సినిమాలకు బ్రేక్ తీసుకున్నాడు. కొద్దీ నెలలుగా కళ్యాణ్ రామ్ తర్వాత సినిమాలు ఏంటి అనే దానిపై ఎలాంటి అప్డేట్ లేదు. నెక్ట్స్ ఎవరితో అని నందమూరి ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు. ఈసారి, హిట్ కొట్టి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చే లక్ష్యంతో కళ్యాణ్ రామ్ సన్నద్ధమవుతున్నాడని సమాచారం. తాజా రిపోర్ట్స్ ప్రకారం,కళ్యాణ్ రామ్ రెండు సినిమాలు పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నాడట.
వివరాలు
ఈ సినిమాతో పాటు మరో సినిమా
ఇందులో ఒకటి శ్రీకాంత్ విస్సా దర్శకత్వంలో ఉంటుంది.ఆయన టైగర్ నాగేశ్వరరావు,డెవిల్,కిట్టు ఉన్నాడు జాగ్రత్త వంటి సినిమాలకు కథ రచన, పుష్ప సినిమా కోసం డైలాగ్ రైటర్ గా పని చేసిన వ్యక్తి. ఇటీవల ఓకథను కళ్యాణ్ రామ్‌కు వినిపించగా అందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడట. ఫైనల్ వర్షన్ డైలాగ్స్ కూడా పూర్తిచేసి,త్వరలోనే అధికారిక అనౌన్స్మెంట్ ఇవ్వనున్నారు. అదేవిధంగా,మరో సినిమా కూడా కళ్యాణ్ రామ్ రెడీ చేస్తున్నాడట,అది బింబిసార 2. బింబిసార సూపర్ హిట్ అయినప్పటి నుండి సీక్వెల్ తీసే చర్చలు జరుగుతున్నాయి,కానీ మూడు సంవత్సరాలుగా పక్కన పెట్టారు. వచ్చే ఏడాది సెకండాఫ్‌లో మొదలయ్యే ఛాన్స్ ఉందని సమాచారం.శ్రీకాంత్ విస్సా సినిమా కోసం సరికొత్త లుక్ లో దర్శనం ఇవ్వబోతున్నాడట కళ్యాణ్ రామ్.